Indian hockey captain
-
ఒకప్పుడు టీమిండియా కెప్టెన్.. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్!
ఐపీఎల్-2023లో భాగంగా గురువారం మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ విషయం పక్కన పెడితే.. మొహాలీ స్టేడియం వద్ద భారత పురుషుల హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాజ్‌పాల్ సింగ్ పోలీస్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ కనిపించాడు. 2011లో భారత కెప్టెన్‌గా పనిచేసిన రాజ్‌పాల్ సింగ్.. ప్రస్తుతం మొహాలీ ట్రాఫిక్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. స్టేడియం మొయిన్ గేట్ వద్ద సెక్యూరిటీగా ఉన్న రాజ్‌పాల్ సింగ్.. తన సహచరులతో కలిసి ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకున్నాడు. కాగా ఐపీఎల్ మ్యాచ్‌లే కాకుండా గత కొంత కాలంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో కూడా తన విధులు నిర్వహించినట్లు రాజ్‌పాల్ తెలిపాడు. స్టేడియం వద్ద పరిస్థితులను ఎలా కంట్రోల్ చేయాలో తనకు బాగా తెలుసని, ఇదంతా డ్యూటీలో భాగమని స్టార్‌స్పోర్ట్‌తో రాజ్‌పాల్ సింగ్ పేర్కొన్నాడు. కాగా రాజ్‌పాల్ మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్స్ పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు నాయకత్వం వహించాడు. అదే విధంగా 2011 ఆసియా పురుషుల హాకీ చాంపియన్స్ ట్రోఫీని అతడి సారథ్యంలోనే భారత్ సొంతం చేసుకుంది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్‌ను భారత జట్టు ముద్దాడింది. చదవండి: IPL 2023: చెన్నైతో మ్యాచ్.. సన్‌రైజర్స్ జట్టులో కీలక మార్పు! యార్కర్ల కింగ్‌కు నో ఛాన్స్ IPL 2023: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్ -
భారత హాకీ దిగ్గజం చరణ్‌జిత్ సింగ్ కన్నుమూత
Hockey Legend Charanjit Singh Passed Away: భారత హాకీ దిగ్గజం, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత చరణ్‌జిత్ సింగ్(90) కన్నుమూశారు. 1964 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు సారధిగా వ్యవహరించిన ఈ మాజీ మిడ్ ఫీల్డ్ ఆటగాడు.. ఇవాళ ఉదయం హిమాచల్ ప్రదేశ్‌లోని తన స్వగృహంలో తనువు చాలించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుత్ను ఆయన.. కార్డియాక్ అరెస్ట్ కారణంగా తుది శ్వాస విడిచినట్లు డాక్టర్లు దృవీకరించారు. చరణ్‌జిత్ మరణ వార్తను కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. చరణ్‌జిత్ సింగ్ మృతి పట్ల భారత హాకీ సమాఖ్య విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించింది. On behalf of Hockey India, we mourn the loss of a great figure of Indian Hockey, Shri Charanjit Singh.May his soul Rest in Peace🙏 pic.twitter.com/PTb38lHDS6— Hockey India (@TheHockeyIndia) January 27, 2022 చదవండి: అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ -
'సర్దార్ పై రేప్ కేసు నమోదు చేయాలి'
న్యూఢిల్లీ: భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ పై రేప్ కేసు నమోదు చేయాలని ఢిల్లీ మహిళా సంఘం(డీసీబ్ల్యూ) డిమాండ్ చేసింది. సర్దార్ సింగ్ కు అనుకూలంగా పంజాబ్ పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. అతడిపై పంజాబ్, ఢిల్లీలో కేసులు పెట్టినా పట్టించుకోడం లేదని తెలిపింది. దీనిపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హాకీ ఇండియాకు నోటీసు జారీ చేసింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని సర్దార్ సింగ్ చిరకాల స్నేహితురాలు ఢిల్లీలోని చాణక్యపురి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టామని డీసీపీ జతిన్ నార్వాల్ తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీని గురించి సర్దార్ సింగ్ ను అడగ్గా... 'ఆమె ఎప్పుడు ఫిర్యాదు చేసింది. నేను ఎవరినీ నియంత్రించలేను. ఎవరి ఆలోచనలను మార్చలేదు. దీనిపై కామెంట్ చేయను. పంజాబ్ పోలీసులు ఆమె ఫిర్యాదును తోసిపుచ్చారు. నా ఆటపైనే దృష్టి పెట్టాను. ఒలింపిక్స్ గురించే ఇప్పుడు ఆలోచిస్తున్నా'ని సమాధానం ఇచ్చాడు. ఈ వివాదంపై వ్యాఖ్యానించేందుకు హాకీ ఇండియా చైర్మన్ నరేంద్ర బాత్రా నిరాకరించారు. తాను విదేశాల్లో ఉన్నానని, తిరిగొచ్చాక మాట్లాడతానని చెప్పారు. 2014, అక్టోబర్ లో ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ లో తనపై సర్దార్ సింగ్ అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. హోటల్ పైనుంచి తోసి తనను చంపేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. 2012లో సోషల్ మీడియాతో సింగ్ పరిచయం అయ్యాడని.. 2014, ఫిబ్రవరిలో తమద్దరికీ ఎంగేజ్ మెంట్ జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి పేరుతో తనకు దగ్గరయ్యాడని చెప్పింది. 2015, మేలో తనకు అబార్షన్ చేయించాడని వెల్లడించింది. దీనిపై ఈ ఏడాది జనవరి 31న పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది.