PC: sports star
ఐపీఎల్-2023లో భాగంగా గురువారం మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ విషయం పక్కన పెడితే.. మొహాలీ స్టేడియం వద్ద భారత పురుషుల హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాజ్‌పాల్ సింగ్ పోలీస్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ కనిపించాడు.
2011లో భారత కెప్టెన్‌గా పనిచేసిన రాజ్‌పాల్ సింగ్.. ప్రస్తుతం మొహాలీ ట్రాఫిక్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. స్టేడియం మొయిన్ గేట్ వద్ద సెక్యూరిటీగా ఉన్న రాజ్‌పాల్ సింగ్.. తన సహచరులతో కలిసి ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకున్నాడు. కాగా ఐపీఎల్ మ్యాచ్‌లే కాకుండా గత కొంత కాలంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో కూడా తన విధులు నిర్వహించినట్లు రాజ్‌పాల్ తెలిపాడు.
స్టేడియం వద్ద పరిస్థితులను ఎలా కంట్రోల్ చేయాలో తనకు బాగా తెలుసని, ఇదంతా డ్యూటీలో భాగమని స్టార్‌స్పోర్ట్‌తో రాజ్‌పాల్ సింగ్ పేర్కొన్నాడు. కాగా రాజ్‌పాల్ మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్స్ పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు నాయకత్వం వహించాడు.
అదే విధంగా 2011 ఆసియా పురుషుల హాకీ చాంపియన్స్ ట్రోఫీని అతడి సారథ్యంలోనే భారత్ సొంతం చేసుకుంది. ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్‌ను భారత జట్టు ముద్దాడింది.
చదవండి: IPL 2023: చెన్నైతో మ్యాచ్.. సన్‌రైజర్స్ జట్టులో కీలక మార్పు! యార్కర్ల కింగ్‌కు నో ఛాన్స్
IPL 2023: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్
Comments
Please login to add a commentAdd a comment