ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి అదరగొట్టాడు. పంజాబ్ బౌలర్లను విరాట్ ఊచకోత కోశాడు.
తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 47 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు రజిత్ పాటిదార్(55), కామెరాన్ గ్రీన్(46) రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.
ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై 1000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.
తద్వారా ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌లో కోహ్లి పంజాబ్ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై 1000 పరుగులు మైలు రాయిని అందుకున్నాడు.
అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కోహ్లి 600 పరుగుల మార్కును కూడా అందుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 634 పరుగులు చేశాడు.
తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 600 పరుగులు మార్క్‌ను అందుకున్న కేఎల్ రాహుల్ రికార్డును కోహ్లి సమం చేశాడు. కోహ్లి 4 సీజన్‌లలో 600 ప్లస్ పరుగులు చేశాడు. రాహుల్ కూడా 4 సీజన్‌లలో 600 పైగా పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment