
సాక్షి, హైదరాబాద్: జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చిత్రంతో తపాలాశాఖ ప్రత్యేక పోస్టల్ కవర్‌ను రూపొందించింది. పీవీ సింధు చేతుల మీదుగా తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఎస్.రాజేంద్రకుమార్ ఇతర తపాలా ఉన్నతాధికారులతో కలిసి ఈ కవర్‌ను విడుదల చేశారు. దీన్ని గౌరవంగా భావిస్తున్నట్లు సింధు పేర్కొంది.