భారత స్టార్ జావెలిన్ త్రోయర్.. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. ఈ లీగ్‌లో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును చోప్రా బద్దలు కొట్టాడు. గురువారం స్టాక్‌హోమ్ వేదికగా జరిగిన ఈ లీగ్ పోటీల్లో నీరజ్ తృటిలో బంగారు పతకాన్ని కోల్పోయాడు. ఈ పోటీల్లో 89.4 మీటర్ల అద్భుతమైన త్రోతో రెండో స్థానంలో నిలిచిన చోప్రా రజిత పతకం కైవసం చేసుకున్నాడు. ఇక గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 90.31 మీటర్ల బెస్ట్ త్రోతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు.
కాగా డైమండ్ లీగ్‌లో నీరజ్‌కు ఇదే తొలి పతకం. కాగా ఇటీవల ఫిన్లాండ్ వేదికగా జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో రజతం గెలిచిన నీరజ్ చోప్రా.. ఈటెను 89.30 మీటర్ల దూరం విసిరి జాతీయ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డైమండ్ లీగ్‌లో తన తొలి ప్రయత్నంలోనే 89.4 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. ఆ తర్వాత వరుసగా చోప్రా 84.37మీ, 87.46మీ, 84.77మీ, 86.67, 86.84మీ త్రోలు చేశాడు.
చదవండి: FIH Women's Hockey World Cup 2022: మహిళల ప్రపంచకప్ హాకీకి సర్వం సిద్దం
Olympic Champion @Neeraj_chopra1 sets the new National Record and Personal Best at 2022 #StockholmDL with a throw of 89.94m, finishing 2nd
— Anurag Thakur (@ianuragthakur) July 1, 2022
Take a look at the record breaking throw! pic.twitter.com/r3X7IK7LSp
Comments
Please login to add a commentAdd a comment