Diamond League Meet
-
‘డైమండ్’ మెరుపులకు ‘సై’
బ్రసెల్స్ (బెల్జియం): అథ్లెటిక్స్ ప్రపంచంలో ప్రతిష్టాత్మక ఈవెంట్ అయిన డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో అగ్రశ్రేణి అథ్లెట్లంతా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఇటీవల పారిస్ ఒలింపిక్స్ పతకాలతో మెరిసిన ఆటగాళ్లంతా మళ్లీ తమ స్థాయిని ప్రదర్శించాలని పట్టుదలగా ఉన్నారు. పోటీ పడేందుకు ఈ ఏడాది మొత్తం 14 డైమండ్ లీగ్ సిరీస్‌లు అందుబాటులో ఉండగా... తాము ఎంచుకున్న సిరీస్‌లలో పాల్గొనడం ద్వారా సాధించిన పాయింట్లతో ఆటగాళ్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు కలిపి మొత్తం 32 అంశాల్లో పతకాలు గెలిచేందుకు అవకాశం ఉంది. పోల్‌వాల్ట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన అర్మాండ్ డుప్లాంటిస్ (స్వీడన్), అమెరికా స్ప్రింటర్ ష కారీ రిచర్డ్సన్, స్టార్ హర్డ్లర్ సిడ్నీ మెక్‌లాలిన్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఫెయిత్ కిపైగాన్ లాంటి టాప్ ప్లేయర్లు ఫైనల్లో బరిలోకి దిగుతున్నారు. లెట్సిల్ టె»ొగో (బోట్స్వానా), ర్యాన్ క్రూజర్, యరస్లొవా మహుచుక్ తదితరులు కూడా తుది సమరంలో పోటీ పడుతున్నారు.ఓవరాల్‌గా 18 మంది ఒలింపిక్ విజేతలు ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండటం విశేషం. 50 వేల సామర్థ్యం గల కింగ్ బౌదిన్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తారు. ఇక్కడ విజేతగా నిలిచిన వారికి డైమండ్ లీగ్ ట్రోఫీతో 30 వేల డాలర్ల ప్రైజ్‌మనీ, వచ్చే ఏడాది జపాన్‌లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభిస్తుంది. అగ్రశ్రేణి అథ్లెట్ల ఆటతో రెండు రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు మరింత వినోదం ఖాయం. నేడు సాబ్లే... రేపు నీరజ్ డైమండ్ లీగ్ ఫైనల్లో భారత్ నుంచి ఇద్దరు అథ్లెట్స్ పోటీ పడుతుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో జాతీయ రికార్డు సాధించిన అవినాశ్ సాబ్లే ఈ పోటీల్లో బరిలో నిలిచాడు. నేటి రాత్రి 12.30 గంటలకు అతని ఈవెంట్ మొదలవుతుంది. ఈ ఏడాది పారిస్, సిలేసియాలలో జరిగిన సిరీస్‌లలో పాల్గొన్న సాబ్లే మొత్తం 3 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచాడు. ఫైనల్లో 12 మంది మాత్రమే పోటీ పడే అవకాశం ఉంది. అయితే తనకంటే మెరుగైన స్థానంలో నిలిచిన నలుగురు అథ్లెట్లు తప్పుకోవడంతో సాబ్లేకు చాన్స్ లభించింది. మరోవైపు భారత దిగ్గజ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించడంలో ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. దోహా, లుసాన్ సిరీస్‌లలో పాల్గొన్న అతను మొత్తం 14 పాయింట్లు సాధించి ఓవరాల్‌గా నాలుగో స్థానం సాధించాడు. గత ఏడాది డైమండ్ లీగ్‌లో చోప్రా రన్నరప్‌గా నిలిచాడు. రేపు అర్ధరాత్రి 12 గంటల నుంచి నీరజ్ చోప్రా ఈవెంట్ జరుగుతుంది. జ్యూరిక్ (స్విట్జర్లాండ్)లో జరిగిన 2022 డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా విజేతగా... యూజీన్ (అమెరికా)లో జరిగిన 2023 డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్ రన్నరప్‌గా నిలిచాడు. -
వన్స్‌మోర్... వరల్డ్ రికార్డు
సిలెసియా (పోలాండ్): క్రీడాకారులెవరైనా ఒకసారి ప్రపంచ రికార్డు సృష్టిస్తేనే ఎంతో గొప్ప ఘనతగా భావిస్తారు. రెండుసార్లు బద్దలు కొడితే అద్భుతం అనుకుంటారు... మూడుసార్లు వరల్డ్ రికార్డు నెలకొలి్పతే అసాధారణం అనుకుంటారు... మరి 10 సార్లు ప్రపంచ రికార్డులను సవరించిన వారిని ఏమనాలి...! ప్రస్తుతానికి మోండో డుప్లాంటిస్ అని అనాల్సిందే. వరల్డ్ రికార్డులు తన చిరునామాగా మలుచుకొని... ప్రపంచ రికార్డులు సృష్టించడం ఇంత సులువా అన్నట్లు స్వీడన్ పోల్‌వాల్టర్ మోండో డుప్లాంటిస్ చెలరేగిపోతున్నాడు. మూడు వారాల క్రితం పారిస్ ఒలింపిక్స్‌లో తొమ్మిదోసారి తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన డుప్లాంటిస్... తాజాగా పోలాండ్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో 10వసారి వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. తన రెండో ప్రయత్నంలో డుప్లాంటిస్ 6.26 మీటర్ల ఎత్తును దాటేసి కొత్త ప్రపంచ రికార్డును లిఖించాడు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌లో 6.25 మీటర్లతో తానే సృష్టించిన వరల్డ్ రికార్డును డుప్లాంటిస్ సవరించాడు. ప్రపంచ రికార్డు సృష్టించినందుకు డుప్లాంటిస్కు 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. మరోవైపు ఇదే మీట్లో నార్వేకు చెందిన జాకబ్ ఇంగెబ్రింగ్స్టెన్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఇంగెబ్రింగ్స్టెన్ 7 నిమిషాల 17.55 సెకన్లలో గమ్యానికి చేరాడు. ఈ క్రమంలో 1996లో కెన్యా అథ్లెట్ డేనియల్ కోమెన్ (7 నిమిషాల 20.67 సెకన్లు) నెలకొలి్పన వరల్డ్ రికార్డు తెరమరుగైంది. ప్రపంచ రికార్డు సృష్టించినందుకు జాకబ్‌కు కూడా 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ అందించారు. -
పారిస్ ఒలింపిక్స్‌కు అవినాశ్ సాబ్లే అర్హత
భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్లో అర్హత సాధించాడు. పోలాండ్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల అవినాశ్ 8 నిమిషాల 11.63 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని (8ని:15.00 సెకన్లు) అవినాశ్ అధిగమించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో హీట్స్‌లోనే వెనుదిరిగిన అవినాశ్ 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో, 2019 ఆసియా చాంపియన్‌షిప్‌లో రజత పతకాలు గెలిచాడు. -
'90 మీటర్ల దూరం విసిరినా పతకం రాకపోతే'
అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గురువారం విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. రెండో ప్రయత్నంలో ఈటెను 88.44 మీటర్ల దూరం విసిరి ఎవరికి అందనంతో ఎత్తులో నిలిచిన నీరజ్.. అగ్రస్థానంలో నిలిచి తొలిసారి ట్రోఫీని అందుకున్నాడు. అయితే టోక్యో ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా ఇప్పటికే చాలా ఈవెంట్స్‌లో పాల్గొన్నప్పటికి అతని అత్యధిక దూరం 89.94 మీటర్లుగా ఉంది. ఈ ఏడాది జూన్ 30న జరిగిన స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ దీనిని అందుకున్నాడు. అయితే నీరజ్ 90 మీటర్లు మార్క్ ఎప్పుడు అందుకుంటాడా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన అనంతరం నీరజ్ చోప్రా మీడియాతో సుధీర్ఘంగా మాట్లాడాడు. ‘జావెలిన్‌ను 90 మీటర్లు విసిరేందుకు ప్రయత్నించా. దానిని అందుకోలేకపోయినా బాధపడటం లేదు. ఎందుకంటే డైమండ్ ట్రోఫీ గెలవడం అన్నింటికంటే ముఖ్యం. అది నేను సాధించాను. 90 మీటర్ల మార్క్ అనేది పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంది. దానిని అందుకొని కూడా పతకం గెలవకపోతే వృథా కదా! ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత ఆటగాళ్లకు గుర్తింపు రావడం కూడా ఎంతో అవసరం. అన్నింటికి మించి నా కుటుంబం కూడా ఇక్కడే ఉంది. తొలిసారి వారంతా నేను పాల్గొన్న ఒక అంతర్జాతీయ ఈవెంట్‌కు హాజరయ్యారు. మరో వైపు నాపై ఇప్పటికే అంచనాల ఒత్తిడి తీవ్రంగా ఉంది. కొత్తగా ఒత్తిడి పెంచుకోలేను. అందరూ ఇప్పుడు స్వర్ణమే ఆశిస్తున్నారు. నేను వంద శాతం ప్రయత్నిస్తాను కానీ అది ఎప్పుడూ సాధ్యం కాదని అందరూ అర్థం చేసుకోవాలి’ అంటూ తెలిపాడు. చదవండి: Neeraj Chopra: ఎదురులేని నీరజ్ చోప్రా.. పట్టిందల్లా బంగారమే Golds,Silvers done, he gifts a 24-carat Diamond 💎 this time to the nation 🇮🇳🤩 Ladies & Gentlemen, salute the great #NeerajChopra for winning #DiamondLeague finals at #ZurichDL with 88.44m throw. FIRST INDIAN🇮🇳 AGAIN🫵🏻#indianathletics 🔝 X-*88.44*💎-86.11-87.00-6T😀 pic.twitter.com/k96w2H3An3 — Athletics Federation of India (@afiindia) September 8, 2022 -
ఎదురులేని నీరజ్ చోప్రా.. పట్టిందల్లా బంగారమే
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రాకు ఎదురులేకుండా పోతుంది. అతను ఏం పట్టినా బంగారమే అవుతుంది. తాజాగా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో విజయం సాధించిన నీరజ్ చోప్రా ట్రోఫీని ఎగురేసుకుపోయాడు. భారత కాలమాన ప్రకారం జ్యూరిచ్ వేదికగా గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన గేమ్‌లో నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలో ఈటెను 88.34 మీటర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచాడు. అతనికి పోటీగా ఉన్న ఐదుగురు కనీసం దరిదాపులోకి కూడా రాలేకపోయారు. దీంతో ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ట్రోఫీ నీరజ్ సొంతమైంది. ఇక గేమ్ విషయానికి వస్తే.. తొలి ప్రయత్నంలో నీరజ్ చోప్రా ఫౌల్ చేసి డిస్క్వాలిఫై అయ్యాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో ఈటెను 88.44 మీటర్లు దూరం విసిరాడు. మూడో ప్రయత్నంలో 88 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 86.11 మీటర్లు, చివరి ప్రయత్నంలో 87 మీటర్లు విసిరాడు. అయితే నీరజ్‌తో పాటు ఉన్న మిగతా ఐదుగురు వేగాన్ని అందుకోవడంలో విఫలమయ్యారు. ఇక 2017, 2018 డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్‌కు నీరజ్ అర్హత సాధించినా పతకం సాధించలేకపోయాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో సంచలనం సృష్టించిన నీరజ్ ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతంతో మెరిశాడు. Golds,Silvers done, he gifts a 24-carat Diamond 💎 this time to the nation 🇮🇳🤩 Ladies & Gentlemen, salute the great #NeerajChopra for winning #DiamondLeague finals at #ZurichDL with 88.44m throw. FIRST INDIAN🇮🇳 AGAIN🫵🏻#indianathletics 🔝 X-*88.44*💎-86.11-87.00-6T😀 pic.twitter.com/k96w2H3An3 — Athletics Federation of India (@afiindia) September 8, 2022 -
చిన్న గ్యాప్ మాత్రమే.. ప్రపంచ రికార్డుతో ఘనంగా రీఎంట్రీ
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. గజ్జల్లో గాయంతో కామన్వెల్త్ గేమ్స్‌కు దూరంగా ఉన్న నీరజ్ చోప్రా స్విట్జర్లాండ్‌లోని లుసాన్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో మరోసారి అదరగొట్టాడు. శుక్రవారం(ఆగస్టు 26న) జరిగిన అర్హత రౌండ్లో తొలి ప్రయత్నంలోనే నీరజ్ ఈటెను 89.08 మీట్లర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచాడు. ఇది అతని కెరీర్లో మూడో బెస్ట్ త్రో కావడం ఇశేషం. ఇంతకముందు ఇదే సీజన్లో 89.30 మీటర్లు, 89.98 మీటర్ల దూరం ఈటెను విసిరి కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. ఇక నీరజ్ చోప్రా వచ్చే నెలలో 7, 8 తేదీల్లో స్విట్జర్లాండ్‌లోనే డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో పాల్గొంటాడు. నీరజ్ తన తొలి ప్రయత్నంలో ఈటెను 89.08 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 85.18 మీటర్లు, మూడో ప్రయత్నంలో ఈటెను విసరలేదు. నాలుగో ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ చివరి ప్రయత్నంలో 80.04 మీటర్లు మాత్రమే విసరగలిగాడు. అయితే తనకంటే బెస్ట్ ఎవరు వేయకపోవడంతో నీరజ్ తొలి స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. గత నెలలో అమెరికాలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్ సందర్భంగా గాయపడటంతో నీరజ్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగాడు. #NeerajChopra 🇮🇳 Top finish with 89.08m at Lausanne Diamond League 🔥 He is back and back with a bang!#IndianAthletics@Diamond_League pic.twitter.com/0zTwDpjhyU — Athletics Federation of India (@afiindia) August 26, 2022 చదవండి: భారత్‌పై ‘ఫిఫా’ నిషేధం ఎత్తివేత Yora Tade: ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతూ మృత్యు ఒడిలోకి భారత కిక్ బాక్సర్ -
నీరజ్ చోప్రా అరుదైన ఫీట్.. తన రికార్డు తానే బద్దలు కొట్టాడు
భారత స్టార్ జావెలిన్ త్రోయర్.. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. ఈ లీగ్‌లో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును చోప్రా బద్దలు కొట్టాడు. గురువారం స్టాక్‌హోమ్ వేదికగా జరిగిన ఈ లీగ్ పోటీల్లో నీరజ్ తృటిలో బంగారు పతకాన్ని కోల్పోయాడు. ఈ పోటీల్లో 89.4 మీటర్ల అద్భుతమైన త్రోతో రెండో స్థానంలో నిలిచిన చోప్రా రజిత పతకం కైవసం చేసుకున్నాడు. ఇక గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 90.31 మీటర్ల బెస్ట్ త్రోతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. కాగా డైమండ్ లీగ్‌లో నీరజ్‌కు ఇదే తొలి పతకం. కాగా ఇటీవల ఫిన్లాండ్ వేదికగా జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో రజతం గెలిచిన నీరజ్ చోప్రా.. ఈటెను 89.30 మీటర్ల దూరం విసిరి జాతీయ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డైమండ్ లీగ్‌లో తన తొలి ప్రయత్నంలోనే 89.4 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. ఆ తర్వాత వరుసగా చోప్రా 84.37మీ, 87.46మీ, 84.77మీ, 86.67, 86.84మీ త్రోలు చేశాడు. చదవండి: FIH Women's Hockey World Cup 2022: మహిళల ప్రపంచకప్ హాకీకి సర్వం సిద్దం Olympic Champion @Neeraj_chopra1 sets the new National Record and Personal Best at 2022 #StockholmDL with a throw of 89.94m, finishing 2nd Take a look at the record breaking throw! pic.twitter.com/r3X7IK7LSp — Anurag Thakur (@ianuragthakur) July 1, 2022 -
అవినాశ్ అద్భుతం.. ఎనిమిదోసారి జాతీయ రికార్డు
రబట్ (మొరాకో): వరుసగా కొత్త జాతీయ రికార్డులతో సత్తా చాటుతున్న భారత అథ్లెట్ అవినాశ్ సబ్లే మరో అరుదైన ఘనతను సాధించాడు. అథ్లెటిక్స్ ప్రపంచంలో ప్రతిష్టాత్మక ఈవెంట్‌గా గుర్తింపు ఉన్న డైమండ్ లీగ్‌లో అతను ఐదో స్థానంలో నిలిచాడు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అతను 8 నిమిషాల 12.48 సెకన్లలో గమ్యం చేరాడు. ఇది భారత్ తరఫున కొత్త జాతీయ రికార్డు. గత మార్చిలో తానే నమోదు చేసిన 8 నిమిషాల 16.21 సెకన్ల టైమింగ్‌ను దాదాపు మూడు సెకన్ల తేడాతో అవినాశ్ సవరించాడు. ఏకంగా ఎనిమిదిసార్లు అతను తన జాతీయ రికార్డులనే బద్దలు కొడుతూ కొత్త రికార్డులు నెలకొల్పడం విశేషం. గత నెలలో 5000 మీటర్ల పరుగును 13 నిమిషాల 25.65 సెకన్లలో పూర్తి చేసిన అవినాశ్... 30 ఏళ్లనాటి బహదూర్ ప్రసాద్ రికార్డు (13 నిమిషాల 29.70 సెకన్లు)ను తుడిచేశాడు. తాజా ఈవెంట్లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత సూఫినాయ్ బకాలి (7 నిమిషాల 58.28 సెకన్లు)కి స్వర్ణం దక్కింది. చదవండి: Rafael Nadal: ‘సెల్యూట్ ఫరెవర్’.. నాదల్‌పై సచిన్, సెహ్వాగ్ ప్రశంసలు -
బోల్ట్.. ఫిట్
డైమండ్ లీగ్ మీట్లో స్వర్ణం లండన్ : స్ప్రింట్ విభాగాల్లో వరుసగా మూడో ఒలింపిక్ స్వర్ణంపై గురి పెట్టిన ప్రపంచ చాంపియన్ ఉసేన్ బోల్ట్ పూర్తి ఫిట్నెస్ సాధించే దిశలో ఉన్నట్టు నిరూపించుకున్నాడు. లండన్ డైమండ్ లీగ్ అంతర్జాతీయ మీట్లో ఈ జమైకా స్టార్ పురుషుల 200 మీటర్ల రేసులో స్వర్ణ పతకాన్ని సాధించాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఈవెంట్లో బోల్ట్ 19.89 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. అలోన్సో ఎడ్వర్డ్ (పనామా-20.04 సెకన్లు) రజతం, ఆడమ్ జెమిలి (బ్రిటన్-20.07 సెకన్లు) కాంస్యం సాధించారు. ఈ సీజన్లో బోల్ట్ 200 మీటర్ల రేసులో పాల్గొనడం ఇదే తొలిసారి. కాలి కండరాల గాయం కారణంగా ఇటీవల జరిగిన జమైకా ఒలింపిక్ ట్రయల్స్ నుంచి బోల్ట్ వైదొలిగాడు. ట్రయల్స్‌లో పాల్గొనకున్నా జమైకా దేశం బోల్ట్ ఎంట్రీని రియో ఒలింపిక్స్‌కు పంపించింది.