సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లోని పతకాలు సాధించిన క్రీడాకారులపై దేశ వ్యాప్తంగా ప్రశంసలతో పాటు, రివార్డుల జల్లు కురుస్తోంది. తాజాగా టోక్యో ఒలింపిక్స్ విజేతలకు బీసీసీఐ భారీ రివార్డు ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో మెరిసిన నీరజ్ చోప్రాకు రూ.కోటి, వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం పతకం గెలిచిన మీరాబాయి చాను, రెజ్లింగ్‌లో రజతం సాధించిన రవికుమార్ దహియాకు రూ.50లక్షలు చొప్పున.. పీవీ సింధు- కాంస్యం( బాడ్మింటన్), లవ్లీనా బొర్గోహెయిన్- కాంస్యం( బాక్సింగ్), భజరంగ్ పూనియా- కాంస్యం(రెజ్లింగ్)కు రూ.25లక్షల చొప్పున, కాంస్యం పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు రూ.1.25 కోట్ల రివార్డును బీసీసీఐ ప్రకటించింది.
అదే విధంగా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నీరజ్ చోప్రాకు రూ.2 కోట్ల రివార్డు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఇప్పటికే హరియాణాకు చెందిన అథ్లెట్ నీరజ్ చోప్రాకు హరియాణా సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. అతడికి 6 కోట్ల రూపాయల నగదు బహుమానంతోపాటు.. క్లాస్-1 గ్రేడ్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment