![If Your Name Is Neeraj Or Vandana, Get Free Ropeway Ride In Haridwar - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/11/Neeraj-Or-Vandana.jpg.webp?itok=zvU5OwM7)
హరిద్వార్: మీ పేరు నీరజ్ లేదా వందన అయితే, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉచిత రోప్‌వే రైడ్ పొందండంటూ ఉషా బ్రెకో లిమిటెడ్ రోప్‌వే కంపెనీ ప్రకటించింది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, భారత మహిళా హాకీ ప్లేయర్ వందన కటారియాలను గౌరవిస్తూ సదరు రోప్‌వే కంపెనీ ఆగస్టు 11 నుంచి 20 వతేదీ వరకు అక్కడికి వచ్చే టూరిస్టులందరికీ ఉచిత రైడ్‌లను ప్రకటించింది. ఉషా బ్రెకో లిమిటెడ్.. ‘ఉడాన్ ఖటోలా’ బ్రాండ్ పేరుతో రోప్‌వేలను నిర్వహిస్తోంది.
చండీదేవి ఆలయ దర్శనం కోసం వచ్చే నీరజ్, వందన అనే పేరుగల పర్యాటకులు రోప్‌వేను ఉచితంగా ఉపయోగించుకోగలరని హరిద్వార్ రోప్ వే కంపెనీ హెడ్ మనోజ్ దోభల్ తెలిపారు. అయితే, ఇందుకోసం వారు తమ ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కాగా, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆగస్టు 7 న ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ అథ్లెట్‌గాచరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ సాధించిన భారత మహిళా హాకీ ఫార్వర్డ్ వందనా కటారియా హరిద్వార్ నివాసి కావడం ఉషా బ్రెకో లిమిటెడ్ రోప్‌వే కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. వందనా కటారియాను ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment