క్విజ్‌ పోటీ విజేతకు బహుమతి అందజేసిన 'సాక్షి' డిజిటల్‌ | Sakshi Digital Presented Prize Money To Tokyo Olympics 2021 Quiz Competition Winner | Sakshi
Sakshi News home page

Tokyo Olympics: క్విజ్‌ పోటీ విజేతకు బహుమతి అందజేసిన 'సాక్షి' డిజిటల్‌

Published Wed, Sep 8 2021 6:25 PM | Last Updated on Wed, Sep 8 2021 6:40 PM

Sakshi Digital Presented Prize Money To Tokyo Olympics 2021 Quiz Competition Winner

సాక్షి, హైదరాబాద్‌/ నెల్లూరు: ఈ ఏడాది జులై, ఆగస్ట్‌ మాసాల్లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌ 2021లో భారత్‌ ఏ విభాగంలో ఎన్ని(స్వర్ణ, రజత, కాంస్య) పతకాలు గెలుచుకుంటుందో గెస్‌ చేయాలంటూ Sakshi.com జులై 23న ఓ క్విజ్‌ పోటీని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కాంపిటీషన్‌లో కచ్చితమైన గణాంకాలు చెప్పిన టాప్‌-3 పాఠకులకు 5 వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తామని 'సాక్షి’ డిజిటల్‌ విభాగం ప్రకటించింది. విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చిన ఈ పోటీలో నెల్లూరుకు చెందిన డాక్టర్‌ సదా వెంకటేశ్వర్లు విజేతగా నిలిచారు. టోక్యోలో భారత్‌ ఏడు పతకాలు సొంతం చేసుకుంటుందని ఒలింపిక్స్‌ ముగియక ముందే వెంకటేశ్వర్లు వేసిన అంచనా నిజమైంది. 

దీంతో ‘సాక్షి’ డిజిటల్‌ విభాగం ముందుగా ప్రకటించినట్టుగా విజేతకు 5 వేల రూపాయల నగదు అందజేసింది. నెల్లూరులోని సాక్షి ఎడిషన్‌ కార్యాలయంలో బుధవారం బ్రాంచ్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ రావు, ఎడిషన్‌ ఇన్‌చార్జి మోహన్‌.. డాక్టర్‌ సదా వెంకటేశ్వర్లు తరఫున ఆయన సతీమణి కె.ప్రవీణకు డీడీని అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ మాట్లాడుతూ.. ‘సాక్షి’ నిర్వహించిన పోటీలో తన భర్త విజేత కావడం ఆనందంగా ఉందన్నారు. ‘సాక్షి’ డిజిటల్‌ విభాగం వీక్షకులకు పోటీలు నిర్వహించడం.. నగదు ప్రోత్సాహం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. 

చదవండి: Olympics, Paralympics: మట్టిలో మాణిక్యాలు.. హర్యానా సక్సెస్‌ సీక్రెట్‌?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement