sakshi.com
-
సాక్షి వెబ్సైట్లో.. మీ జిల్లాతో పాటు, ప్రాంతీయ వార్తలన్నీ ఒకే చోట..
సాక్షి వెబ్సైట్లో ఇప్పుడు మీ జిల్లాకు సంబంధించిన అన్ని వార్తలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడ ఉన్నా.. ఏ సమయంలోనైనా మీ జిల్లాతో పాటు ప్రాంతీయ వార్తలన్నీ ఒకే చోట sakshi.comలోని జిల్లా వార్తలలో చదవొచ్చు. Dont miss. -
అదే భారత్ గొప్పతనం.. ‘సాక్షి’తో సద్గురు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) 17వ మహాసభలు ఘనంగా జరిగాయి. వాల్టర్ ఇ కన్వెన్షన్ సెంటర్లో జూలై 1 నుండి 3 తేదీ వరకు జరిగిన మూడు రోజుల కార్యక్రమాల్లో వివిధ రంగాల ప్రముఖులు, ఆధ్మాతిక వేత్తలు, అమెరికాలోని తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆటా మహా సభల్లో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, యోగా గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనను పలకరించింది. సద్గురుతో సాక్షి టీవీ రిపోర్టర్ రుచికా శర్మ ఇంటర్వ్యూ... నేటీ టెక్నాలజీ యుగంలో ధనమే పరమావధిగా పరుగులు పెడుతున్న ఈతరం యువత.. ముఖ్యంగా అమెరికా జీవన విధానంలో మునిగి తేలుతున్న మన భారతీయ పిల్లల్లో సంప్రదాయ సంస్కృతులను ఎలా స్థిరంగా నిలబెట్టాలనే దానిపై ‘సాక్షి’ సద్గురు అభిప్రాయాలను తెలుసుకుంది. సద్గురు మాట్లాడుతూ.. ‘అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలు ఇండియాలో స్కూలింగ్ చేయడం వీలు కాదు. కాబట్టి స్కూలింగ్ తరువాత పిల్లలను 4, 5 సంవత్సరాల వరకు ఉన్నత చదువులకు ఇండియాకు పంపించడం మంచింది. ఇండియాలో ఉండే మూడు, నాలుగేళ్లు నేర్చుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా అమెరికాకు, ఇండియాకు ఉన్న జీవన విధానంలో తేడాను గమనిస్తారు. ఎన్నో విషయాలపై అవగాహన వస్తుంది. భారతీయ సంప్రదాయాలు, పద్ధతులు తెలుస్తాయి. భారత్ భిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడ జీవించే భిన్న వర్గాల ప్రజలు, వారి అలవాట్లు, జీవన విధానంపై పిల్లలకు అవగాహన ఏర్పడుతుంది. ఇదే ఇండియా గొప్పతనం. విభిన్న వర్గాల మధ్య జీవించడం ద్వారా వారి ఆలోచనలు, మనస్తత్వాలు తెలుస్తాయి. మన సొంత ఉనికి స్వభావాన్ని తెలుసుకోవచ్చు, జీవిత సత్యం బోధపడుతుంది. ఎంతో అద్భుతమైన మానవత్వం గల మనుషులుగా తయారవుతాం. ఓపెన్ మైండ్‌తో ఇండియాలో ట్రావెల్ చేయడం ముఖ్యం. ఇండియాకు, అమెరికాకు మధ్య మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవహారాల్లో వ్యతాసాలు చూడకుండా ఇక్కడి ప్రజల్లోని మానవత్వాన్ని, సంస్కృతిని నేర్చుకోవడం ఎంతో విలువైనది’ అని సద్గురు పేర్కొన్నారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది వీడియో చూడండి👇 -
క్విజ్ పోటీ విజేతకు బహుమతి అందజేసిన 'సాక్షి' డిజిటల్
సాక్షి, హైదరాబాద్/ నెల్లూరు: ఈ ఏడాది జులై, ఆగస్ట్ మాసాల్లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ 2021లో భారత్ ఏ విభాగంలో ఎన్ని(స్వర్ణ, రజత, కాంస్య) పతకాలు గెలుచుకుంటుందో గెస్ చేయాలంటూ Sakshi.com జులై 23న ఓ క్విజ్ పోటీని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కాంపిటీషన్లో కచ్చితమైన గణాంకాలు చెప్పిన టాప్-3 పాఠకులకు 5 వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తామని 'సాక్షి’ డిజిటల్ విభాగం ప్రకటించింది. విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన ఈ పోటీలో నెల్లూరుకు చెందిన డాక్టర్ సదా వెంకటేశ్వర్లు విజేతగా నిలిచారు. టోక్యోలో భారత్ ఏడు పతకాలు సొంతం చేసుకుంటుందని ఒలింపిక్స్ ముగియక ముందే వెంకటేశ్వర్లు వేసిన అంచనా నిజమైంది. దీంతో ‘సాక్షి’ డిజిటల్ విభాగం ముందుగా ప్రకటించినట్టుగా విజేతకు 5 వేల రూపాయల నగదు అందజేసింది. నెల్లూరులోని సాక్షి ఎడిషన్ కార్యాలయంలో బుధవారం బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ రావు, ఎడిషన్ ఇన్చార్జి మోహన్.. డాక్టర్ సదా వెంకటేశ్వర్లు తరఫున ఆయన సతీమణి కె.ప్రవీణకు డీడీని అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ మాట్లాడుతూ.. ‘సాక్షి’ నిర్వహించిన పోటీలో తన భర్త విజేత కావడం ఆనందంగా ఉందన్నారు. ‘సాక్షి’ డిజిటల్ విభాగం వీక్షకులకు పోటీలు నిర్వహించడం.. నగదు ప్రోత్సాహం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. చదవండి: Olympics, Paralympics: మట్టిలో మాణిక్యాలు.. హర్యానా సక్సెస్ సీక్రెట్? -
వెబ్సైట్ అంటే ఏమిటి?
మరీ లోతైన వివరాలలోకి వెళ్ళకుండా క్లుప్తంగా చెప్పుకోవాలంటే... ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్‌పై మనకు లభించే పుస్తకాలను లేదా పత్రికలను వెబ్‌సైట్స్ (Web Sites) అని అంటారు. మనం చదివే పుస్తకాలలో ఉన్నట్లు వెబ్సైట్లలో కూడా అనేక పేజీలుంటాయి. పుస్తకంలో ఒక పేజీ నుంచి మరో పేజీలోకి ఎలా వెళ్ళవచ్చో వెబ్సైట్లో కూడా అలాగే ఒక పేజీ నుంచి మరో పేజీలోకి వెళ్ళవచ్చు. పుస్తకంలో లాగానే వెబ్సైట్లోనూ తిరిగి మెుదటి పేజీలోకి రావచ్చు. ఇలా ఒక పేజీ నుంచి మరో పేజీలోకేగాక ఒకోసారి ఒక వెబ్సైట్ నుంచి మరో వెబ్సైట్లోకి నేరుగా వెళ్ళిపోయే సదుపాయమూ వుంటుంది. ఇలాంటి సదుపాయం పుస్తకాలలో వుండదు. పుస్తకాలలో మనకు అవసరవునుకున్న పేజీలను జెరాక్స్ తీసుకోగల్గినట్లే వెబ్సైట్ల నుంచి కూడా మనకు కావాలనుకున్న పేజీల ప్రింట్లను తీసుకోవచ్చు. ఒకో వెబ్సైట్లోనూ కొన్ని పదుల పేజీల నుంచి (కొన్నిటిలో పదికన్నా తక్కువే ఉండొచ్చు) కొన్ని వేల పేజీల దాకా ఉండవచ్చు. ఇవాళ ఇంటర్నెట్లో 10 కోట్లకు పైగా వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవన్నీ మన పుస్తకాల లాగా కేవలం అక్షరాలు – బొమ్మలతో మాత్రమే నిండి వుండవు. వీటిలో 1. అక్షరాలు, అంకెలతో వుండేవి (టెక్ట్స్ ) 2. నిశ్చల చిత్రాలతో (ఇమేజస్) వుండేవి. 3. మాటలు, పాటలు, సంగీతంతో (సౌండ్) వుండేవి. 4. కదిలే చిత్రాలతో (వీడియో) వుండేవి. అని వెబ్సైట్లు ప్రధానంగా 4 రకాలవి వుంటాయి. కొన్ని వెబ్సైట్లలో ఈ నాలుగు అంశాలూ ఉండవచ్చు. మరికొన్నిటిలో వీటిలో ఏవైనా ఒక రెండో, మూడో వుండవచ్చు. అనేక దేశాలకు చెందిన ప్రభుత్వాలు, వివిధ సేవలను అందించేవారు, వస్తువులను ఉత్పత్తి చేసేవారు, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు... ఆఖరికి వ్యక్తులు కూడా తమకు సంబంధించిన సమాచారాన్ని వెబ్సైట్ల – రూపంలో ఇంటర్నెట్ వ్యవస్థలో పొందుపరుస్తున్నారు. ఆయా వెబ్సైట్లను ఇంటర్నెట్లో ఓపెన్ చేసి చూడడం ద్వారా మనం మనకు కావలసిన సమాచారాన్ని పొందవచ్చు. ఉదాహరణకు www.sakshi.com అనే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి మీరు ‘సాక్షి’ పేపర్ని చదవవచ్చు. అదే విధంగా www.yatra.com అనే వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా వివిధ యాత్రాస్థలాల వివరాలను తెలుసుకోవచ్చు. వివిధ స్థాయిల విద్యార్థుల చదువుకి, మనోవికాసానికి పనికొచ్చే వెబ్సైట్లు కూడా ఇంటర్నెట్లో లభిస్తాయి. -
టుడే అప్ డేట్స్
*నేడు తెలంగాణ బంద్ *నాల్గొ రోజూ కొనసాగుతున్న గోదావరి పుష్కరాలు *కొనసాగుతున్న పారిశుధ్య కార్మికుల సమ్మె *వామపక్ష పార్టీల నేతలు పలువురు అరెస్టు *భారత్ - జింబాబ్వే టీ-20 సాయంత్రం 4.30 గంటలకు *జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాల పెంపు *తెలంగాణకు కీలక పదవులు కట్టబెట్టే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం *నేడు సాయంత్రం 5 గంటల నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం *నేటి నుంచి ఓయూ పీజీ వెబ్ ఆప్షన్లు *నిలిచిన అమర్ నాథ్ యాత్ర *తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య *నైజీరియాలో బాంబు పేలుళ్లలో 25 మంది మృతి. -
‘సాక్షి’ మొబైల్ యాప్‌కి విశేష స్పందన
⇒ డిజిటల్ టెక్నాలజీతోనే పాఠకులకు మరింత చేరువ ⇒ డిజిటల్ మీడియా సదస్సులో ‘సాక్షి’ డిజిటల్ మీడియా, ఐటీ ప్రెసిడెంట్ దివ్యారెడ్డి సాక్షి, న్యూఢిల్లీ : అన్ని వర్గాల పాఠకులకు వార్తలను తక్కువ సమయంలో చేరవేసేందుకు డిజిటిల్ మీడియా ఎంతో ఉపకరిస్తుందని ‘సాక్షి’ డిజిటల్ మీడియా, ఐటీ ప్రెసిడెంట్ దివ్యా బొల్లారెడ్డి అన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం విరివిగా పెరిగిపోతున్న ఈ సమయంలో అన్ని వర్గాల పాఠకులను, ముఖ్యంగా యువతను మరింతగా ఆకర్షించేందుకు సోషల్ మీడియాతోపాటు సరికొత్త యాప్స్ వాడాల్సిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. ఢిల్లీలో మంగళవారం డిజిటల్ మీడియా ఇండియా-2015 సదస్సుకు దివ్యారెడ్డి హాజరయ్యారు. బీబీసీ సహా ప్రపంచస్థాయి మీడియా సంస్థలకు చెందిన పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ మీడియాలో వస్తున్న మార్పులు, పాఠకుల అవసరాలకు తగ్గట్టుగా చేసుకోవాల్సిన మార్పులు సహా పలు అంశాలపై చర్చించారు. సదస్సులో భాగంగా ‘ఏ కేస్ స్టడీ ఆన్ ది డిజిటల్ కంటెంట్ స్ట్రాటజీ ఆఫ్ సాక్షి డెయిలీ’ అన్న అంశంపై దివ్యారెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలుగు భాషలో సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ, సాక్షి డాట్‌కామ్ ద్వారా వార్తలను, వార్తా కథనాలను మరింత వేగవంతంగా చేరువచేసేందుకు తీసుకుంటున్న చర్యలు, టెక్నాలజీలో తీసుకువచ్చిన మార్పులను వివరించారు. సాక్షి వెబ్ మీడియాలో తాజా వార్తలను అందించడంతోపాటు రోజువారీ పత్రికలో, టీవీలో వచ్చే వార్తలతోపాటు ఆ వార్తకు సంబంధించిన అదనపు సమాచారాన్ని, ఒక సంఘటనకు సంబంధించిన అదనపు ఫొటోలను, వీడియోలను వీలైనన్ని ఎక్కువ పాఠకులకు చేరువ చేసేలా తీర్చిదిద్దినట్టు చెప్పారు. వార్తల్లో నాణ్యత లోపించకుండా అంతర్గతంగా ఎలాంటి వ్యవస్థను రూపొందించుకోవాలనే అంశాలను వివరించారు. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలోనూ పాఠకుడితో అనుబంధాన్ని కొనసాగించేందుకు తీసుకుంటున్న చర్యలను తెలిపారు. కొత్తగా ప్రారంభించిన సాక్షి మొబైల్ యాప్‌కి సైతం విశేష స్పందన లభిస్తోందన్నారు. దీనిలో యూజర్ జనరేటెడ్ కంటెంట్(యూజీసీ)వినియోగంతో వీక్షకుడితో అనుబంధాన్ని కొనసాగించే అవకాశం ఉందన్నారు. దీనిలో వీక్షకులను సహ భాగస్వామ్యులను చేస్తూ వారు పంపే ఫొటోలను వెబ్‌లో పెడుతున్నామని తెలిపారు. డిజిటల్ మీడియాని వినియోగించే వారిలో యువత శాతం ఎక్కువగా ఉంటున్నందున వారిని ఆకట్టుకునేలా వార్తాంశాలను ఎంపిక చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. టీవీలో వచ్చే వార్తను మరెప్పుడైనా నచ్చిన సమయంలో చూసేలా తక్కువ నిడి వి ఉన్న వీడియోలను మొబైల్ యాప్‌లో పెట్టడం, అందుకు సబంధించిన సమాచారాన్ని టెక్ట్స్ రూపంలో ఇవ్వడంతో వీక్షకుడికి మరింత వెసులుబాటుగా ఉంటోందన్నారు. డిజిటల్ మీడియాలో వస్తున్న మార్పులతో ఎప్పటికప్పుడు నవీనీకరించుకుంటే మరింతగా పాఠకులకు, వీక్షకులకు చేరువకావొచ్చని అన్నారు. -
'వేగం, కచ్చితత్వం.. సాక్షి డాట్‌కామ్'
-
వేగం, కచ్చితత్వం.. సాక్షి డాట్‌కామ్: దివ్యారెడ్డి
న్యూఢిల్లీ: వేగం, కచ్చితత్వంతో కూడిన వార్తలను అందించేందుకు సాక్షి మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తుందని సాక్షి గ్రూపు ఐటీ ప్రెసిడెంట్ దివ్యారెడ్డి అన్నారు. సాక్షి మీడియా పనితీరు గురించి నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాకు వివరించారు. ఢిల్లీలో జరుగుతున్న వాన్ ఇన్ఫ్రా రెండు రోజుల సదస్సులో దివ్యారెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ మీడియా దిగ్గజం బీబీసీ సహా పలు ఇంటర్నేషనల్, నేషనల్, రీజినల్ మీడియా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. డిజిటల్ ప్లాట్‌ఫాంలో విప్లవాత్మక మార్పులను, భవిష్యత్తులో చోటు చేసుకోబోయే మార్పులను సదస్సులో చర్చించారు. వినూత్న మార్పులతో సాక్షి డాట్ కామ్ ఇంటర్నెట్ ప్రపంచంలో ఎలా దూసుకుపోతోందో దివ్యారెడ్డి వివరించారు.