వేగం, కచ్చితత్వం.. సాక్షి డాట్కామ్: దివ్యారెడ్డి
న్యూఢిల్లీ: వేగం, కచ్చితత్వంతో కూడిన వార్తలను అందించేందుకు సాక్షి మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తుందని సాక్షి గ్రూపు ఐటీ ప్రెసిడెంట్ దివ్యారెడ్డి అన్నారు. సాక్షి మీడియా పనితీరు గురించి నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాకు వివరించారు. ఢిల్లీలో జరుగుతున్న వాన్ ఇన్‌ఫ్రా రెండు రోజుల సదస్సులో దివ్యారెడ్డి పాల్గొన్నారు.
అంతర్జాతీయ మీడియా దిగ్గజం బీబీసీ సహా పలు ఇంటర్నేషనల్, నేషనల్, రీజినల్ మీడియా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. డిజిటల్ ప్లాట్‌ఫాంలో విప్లవాత్మక మార్పులను, భవిష్యత్తులో చోటు చేసుకోబోయే మార్పులను సదస్సులో చర్చించారు. వినూత్న మార్పులతో సాక్షి డాట్ కామ్ ఇంటర్నెట్ ప్రపంచంలో ఎలా దూసుకుపోతోందో దివ్యారెడ్డి వివరించారు.