Divya Reddy
-
ప్రస్తుతం దేశంలో 26 శాతం విదేశీ జాతుల ఆవులే
-
స్వదేశీ సాహివాల్‌కు అద్దె గర్భంతో కొత్త ఊపిరి
శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి: చేను, చెలకల్లో మళ్లీ స్వదేశీ గోజాతుల అంబారావాల సవ్వడి పెరిగిపోనుంది. అంతరించిపోతున్న అరుదైన దేశీ పశుసంపద సంరక్షణ బాధ్యతను తీసుకున్నవారితో పాటు, తాజాగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ కొత్త చరిత్రను తెరమీదకు తెస్తోంది. నూటికి నూరుశాతం సాహివాల్ జన్యు లక్షణాలు కలిగిన కోడె వీర్యాన్ని, ఆవు నుండి తీసిన అండాలను జగిత్యాల ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ ప్రయోగశాలలో ఫలదీకరణ చేసి ఆవుల గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా సాహివాల్ దూడలకు ఇటీవలే ఊపిరి పోశారు. కోస్నూరుపల్లె మూల మోహన్‌రెడ్డి, సింగారావుపేట బద్దం రాజశేఖరరెడ్డికి చెందిన ఆవులకు రెండు నెలల క్రితం పుట్టిన లేగదూడలు పూర్తి సాహివాల్ జన్యు లక్షణాలతో ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. గడిచిన ఆర్నెల్లలో వెటర్నరీ కళాశాల వైద్యులు ఈ విధంగా 172 అండాలు ఫలదీకరణ చేసి అందులో వంద వరకు ఆవుల గర్భంలో అమర్చారు. దీంతో వచ్చే రెండు మూడు నెలల్లో ఒక్క జగిత్యాల జిల్లాలోనే వందకు పైగా దేశీ సాహివాల్ దూడలు జన్మించనుండటం పశుసంపద రక్షణకు సంబంధించి గొప్ప మలుపు కానుంది. ఈ పద్ధతి (ఐవీఎఫ్)లో కాకుండా కృత్రిమ గర్భధారణ చేస్తే పూర్తి జన్యులక్షణాలతో దూడలు పుట్టేందుకు పదితరాలు (ముప్పై నుండి నలభై సంవత్సరాలు) సమయం తీసుకునే అవకాశం ఉండగా తాజా అద్దెగర్భ ప్రయోగం తొలి దశలోనే విజయవంతం కావడం స్వదేశీ పశు సంపద అభివృద్ధిపై ఆశలు రేకెత్తిస్తోంది. యాభై స్వదేశీ జాతుల్లో..ప్రస్తుతం పదే! ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిధిలోని బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రీసోర్సెస్ (బీఏజీఆర్) దేశంలో 50 స్వదేశీ గోవు జాతులను గుర్తించగా, అందులో మెజారిటీ జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. 2012–19 మధ్య కాలంలో స్వదేశీ గోవులు 8.94 శాతం అంతరించాయి. ఈ నేపథ్యంలో రైతులు, ప్రభుత్వ సంస్థల సంరక్షణ చర్యలతో.. ప్రస్తుతం ఒంగోలు, పుంగనూరు (ఆంధ్రప్రదేశ్), పొడతురుపు (తెలంగాణ), గిర్ (రాజస్తాన్), సాహివాల్ (పంజాబ్, రాజస్తాన్), తార్పార్కర్ (రాజస్తాన్), డివోని (కర్ణాటక, మహారాష్ట్ర), వేచూర్, కాసరగోడ్ (కేరళ), కాంక్రేజ్ (గుజరాత్, రాజస్తాన్) గోవు జాతులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో ఉన్నాయి. గోకుల్ మిషన్‌తో సంరక్షణ చర్యలు ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా స్వదేశీ జాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘గోకుల్ మిషన్’ను ప్రకటించింది. 2021 మొదలుకుని 2026 వరకు రాష్ట్రీయ పశుధాన్ వికాస్ యోజనను అమలు చేస్తోంది. అందులో భాగంగానే జగిత్యాల వెటర్నరీ కళాశాలలో రూ.5.26 కోట్లతో ఓ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిలో సాహివాల్ గోవుల సంరక్షణను ప్రారంభించింది. తెలంగాణ బ్రాండ్‌గా.. పొడతురుపు ‘పొడతురుపు’గోవులకు ఇటీవలే కేంద్రం తెలంగాణ బ్రాండ్‌గా గుర్తింపునిచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లాతో పాటు నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం ఇవి 15 వేల వరకు ఉన్నట్టు తేల్చారు. కొండల్లోనూ ఆహారం సంపాదిస్తాయి. క్రూర జంతువుల నుండి కాపాడుకుంటాయి. ఈ ఆవు పాలల్లో ఔషధ గుణాలుంటాయి. రోజంతా శ్రమించే గుణం ‘పొడతురుపు’సొంతం. జన్యుపరమైన గుర్తింపు రావటంతో ఈ జాతిని సంరక్షించే బాధ్యతను అధికార యంత్రాంగం చేపట్టింది. అంతటా చేపట్టాలి వెటర్నరీ కాలేజీలో ప్రయోగం విజయవంతం కావటం స్వదేశీ గోమిత్రుల్లో సంతోషం నింపుతోంది. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా జగిత్యాలకు 30 నుండి 40 కి.మీ దూరంలో ఉండే ప్రాంతాల్లోనే ఈ విధంగా చేసేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా, ఈ పరిజ్ఞానం విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలని ఇప్పటికే సొంతంగా స్వదేశీ గోజాతులను సంరక్షిస్తున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. (క్లిక్ చేయండి: వైఎస్సార్ రెండిస్తే.. నేను నలభై చేసిన) సేవ్ స్వదేశీ ఆవు దేశీ గోవులను యుద్ధ ప్రాతిపదికన సంరక్షించాలంటూ అల్లోల దివ్యారెడ్డి ఇటీవల సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన పిల్లలకు స్వచ్చమైన పాలను అందించేందుకు ఆమె పడిన తపన.. స్వదేశీ గో సంరక్షణ వైపు అడుగులు వేయించింది. సంగారెడ్డిలో వంద గోవులతో (గిర్) ప్రారంభమైన దివ్యారెడ్డి ఫామ్ ప్రస్తుతం 250 ఆవులు, కోడెలతో నిండిపోయింది. చాలాకాలంగా పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో స్వదేశీ ఆవులను విదేశీ బ్రీడ్‌తో కృత్రిమ గర్భధారణ చేస్తుండటంతో స్వదేశీ ఆవు జాతులు అంతరించి పోయాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశంలో 26 శాతం హైబ్రిడ్ , మరో 56 శాతం క్రాస్‌బ్రీడ్ గోవులున్నాయని వివరించారు. వీటి స్థానంలో స్వదేశీ జాతుల అభివృద్ధి కోసం తాను ఓ అడుగు ముందుకు వేశానని దివ్యారెడ్డి చెప్పారు. (క్లిక్ చేయండి: అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది) -
Allola DIVYA REDDY: గోమాత
ఆవు... అమ్మ తర్వాత అమ్మ. పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. నేలకు సారం... మట్టికి జీవం ఇస్తుంది. పంటకు ప్రాణం... అవుతుంది. అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది. మనిషి మనుగడకు ఆధారం అయింది. అలాంటి మన ఆవు ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఆవును కాపాడే ఒక అమ్మ కావాలి. ఆ అమ్మ... అల్లోల దివ్యారెడ్డి. పెట్ రైట్స్ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు చట్టాలున్నాయి. పులుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకుంది ప్రభుత్వం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచమంతా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి పర్యావరణ వ్యవస్థలో మన ఆవులు ఎందుకు స్థానాన్ని కోల్పోతున్నాయి. ఆవును మచ్చిక చేసుకుని అడవి నుంచి ఇంటికి తెచ్చుకున్నారు మన పూర్వికులు. ఇప్పుడవి ఎల్లలు దాటి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నాం మనం. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే ఆ తర్వాత ఉద్యమించినా ప్రయోజనం ఉండదంటారు అల్లోల దివ్యారెడ్డి. మన దేశీయ ఆవులను సంరక్షించే బాధ్యతను చేపట్టారామె. ‘ప్రమాదం అంచున ఉన్న దేశీయ ఆవులను సంరక్షించు కుందాం’... అని పిలుపునిస్తున్నారు. ఇందుకోసం సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇప్పుడు ఎకలాజికల్ ఇంజనీరింగ్ బాధ్యతను చేపట్టిన ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారామె. ఏటూ మిల్క్ మన ఆవులవే! ‘‘మాది తెలంగాణ, సంగారెడ్డి జిల్లా కేంద్రం. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. నాన్న వాటర్ వర్క్స్‌లో ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా రిటైర్ అయ్యారు. నేను ఇంజనీరింగ్ తర్వాత పెళ్లి చేసుకుని, మా వారికి వ్యాపారంలో సహాయంగా ఉన్నాను. అత్తగారిల్లు నిర్మల్. ఇద్దరు పిల్లలతో నాలోకం నాదిగా, పిల్లలను చక్కగా పెంచుకోవడమే తొలి ప్రాధాన్యంగా ఉండేది. అలాంటిది 2014 నన్ను పూర్తిగా మార్చేసింది. అప్పుడు వార్తా పత్రికల్లో, టీవీ చానెళ్లలో పాల కల్తీ గురించి వరుస కథనాలు వచ్చాయి. నా పిల్లలకు తాగిస్తున్న పాలు స్వచ్ఛమైనవి కావా, విషపూరితమైన ఆహారాన్ని పిల్లలకు ఇస్తున్నానా... అని ఎంత ఆవేదన చెందానో మాటల్లో చెప్పలేను. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఏటూ (అ2) పాల గురించి అధ్యయనం మొదలుపెట్టాను. మన దేశీయ ఆవు ఇచ్చే పాలే ఏటూ మిల్క్ అని తెలిసిన తర్వాత సంతోషం వేసింది. హైదరాబాద్‌లో ఏటూ మిల్క్ కోసం అన్వేషణ మొదలు పెట్టాను. ఆశ్చర్యం... పాలు దొరకనే లేదు. మనం, మన పిల్లలు మాత్రమే కాదు, మన ఆవు కూడా ప్రమాదం అంచున ఉన్నట్లు అప్పుడు తెలిసింది. వెంటనే పది ఆవులతో సంగారెడ్డిలోని మా పొలంలోనే క్లిమామ్ గోశాల మొదలుపెట్టాను. అక్కడి నుంచి మా ఇంటికి నలభై నిమిషాల ప్రయాణం. అప్పటి నుంచి మా పిల్లలు స్వచ్ఛమైన పాలతో పెరుగుతున్నారు. మన దేశీయ గోసంతతి పెంచడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా 2015లో పది ఆవులతో మొదలైన గోశాలలో ఇప్పుడు 250 ఉన్నాయి. మా క్లయింట్లు చాలా మంది ఇప్పుడు రెండు – మూడు ఆవులను పెంచుకుంటున్నారు. కొంతమంది ఏకంగా వంద ఆవులతో ఫార్మ్ పెట్టారు. దేశ పర్యటన మూపురం ఉన్న ఆవు మన దేశీయ ఆవు. అలాంటి దేశీయ ఆవుల సంఖ్య పెంచడానికి దాదాపుగా దేశమంతా పర్యటించాను. రైతులతో మాట్లాడాను. ఆవును పెంచడం పాలకోసం అనుకుంటారు, కానీ నిజానికి ఆవు పాలు మనకు బోనస్ మాత్రమే. అసలైన ప్రయోజనం నేలకోసం. నేలను సారవంతంగా ఉంచుకున్నంత కాలమే మనిషికి మనుగడ. వందగ్రాముల ఆవుపేడలో పదిలక్షల సూక్ష్మజీవులుంటాయి. అవి నేలను సజీవంగా ఉంచుతాయి. రసాయన ఎరువులు, పురుగుమందులతో నేలలో ఉండాల్సిన జీవజాలం అంతరించిపోతోంది. ఆవుపేడ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చు. అందుకే ‘నేల పండాలంటే ఆవు ఉండాలి. అది మన దేశీయ ఆవు అయి ఉండాలి’ అంటాను. సేంద్రియం మనకు కొత్త కాదు! మన రైతులు సేంద్రియ వ్యవసాయమే చేసేవారు. యాభై – అరవై ఏళ్ల వెనక్కి వెళ్లి చూడండి. వాళ్లకు యూరియాలు, డీఏపీలు తెలియదు. ఆవులు, గేదెల ఎరువుతో సేద్యం చేసుకుంటూ రైతు రాజులాగా జీవించాడు. అలాంటి రైతును అధిక దిగుబడి అంటూ రసాయన ఎరువులతో పక్కదారి పట్టించాం. ఇప్పుడు రైతు ఉన్నంత దీనస్థితిలో మరెవరూ ఉండకపోవచ్చు, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఒడిదొడుకులు మరే పరిశ్రమలోనూ కనిపించవు. ఇప్పుడు మళ్లీ రైతును సేంద్రియం వైపు మళ్లించడానికి వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. గ్రామాల్లో ప్రతి ఇంట్లో కనీసం ఒక్క దేశీయ ఆవు ఉన్నా చాలు, దేశంలో ఆవుల సంతతి పెరుగుతుంది, వ్యవసాయం బాగుపడుతుంది. మనిషి జీవనం గాడిలో పడుతుంది. ఆవులకు కృత్రిమ గర్భధారణను తప్పనడం లేదు, కానీ విదేశీ బ్రీడ్‌తో గర్భధారణను వ్యతిరేకిస్తున్నాను. రెడ్ సింధీ, సహీవాల్, గిర్ వంటి రోజుకు పదిహేను లీటర్ల పాలిచ్చే రకాలున్నాయి. అలాంటి మనదేశీయ జాతితో గర్భధారణ చేసినప్పుడే మన ఆవు మనకు మిగులుతుంది. లేకపోతే శ్రీలంక పరిస్థితి తప్పదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి ఆవులను దిగుమతి చేసుకుందా దేశం. సొంత నేల ఆవు జాతులను పట్టించుకోలేదు. చివరికి దిగుమతి చేసుకున్న బ్రీడ్ నిలవలేదు, సొంత బ్రీడ్ అంతరించిపోయిందక్కడ. నేను న్యాయస్థానం మెట్లెక్కింది కూడా ఈ విషయంలోనే. కృత్రిమ గర్భధారణ హైబ్రీడ్‌తో వద్దు, మన దేశీయ జాతులతో చేయాలని న్యాయస్థానాన్ని కోరాను’’ అన్నారు అల్లోల దివ్యారెడ్డి. ఇంత పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నప్పటికీ ఎక్కడా అవరోధాలు లేకుండా ముందుకు సాగడానికి ఇంట్లో అందరి సహకారం ఉందని, కుటుంబ సభ్యుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారామె. ఆవు నన్ను ఎంచుకుంది! అవుతో కలిసి సాగుతున్న నా జర్నీ అంతటినీ ఓసారి వెనక్కి చూసుకుంటే... గోసేవను ఎంచుకున్నది నేను కాదు, గోవులే నన్ను ఎంచుకున్నాయనిపిస్తోంది. నేను చేస్తున్నదేదీ ముందుగా ప్రణాళిక వేసుకుని మొదలుపెట్టింది కాదు. పాల కల్తీ గురించి తెలిసినప్పటి నుంచి ఒక్కటొక్కటిగా అడుగులు వాటంతట అవే పడుతున్నాయి. ఈ పోరాటంలో విజయం సాధించేవరకు విశ్రమించను. ఆవును నగరాల్లో ఇళ్లకు కూడా పరిచయం చేయడానికి మట్టి గణపతిలో కొద్దిగా గోమయం కలిపి చేస్తున్నాను. గోమయంతో కూడిన మట్టి గణపతి విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేయవచ్చు లేదా కరిగించి ఇంట్లో మొక్కలకు ఎరువుగానూ వేసుకోవచ్చు. మన ఆవు కోసం ఇంకా ఏ ఆలోచన వస్తే దానిని ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్తాను. మన జాతీయ చిహ్నంలో ఉన్న ఎద్దు బొమ్మను ఉదహరిస్తూ జాతి సంపదను పరిరక్షించుకుందాం... అని సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నంలో ఉన్నాను. – అల్లోల దివ్యారెడ్డి, వ్యవస్థాపకురాలు, క్లిమామ్ గోశాల – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
విశ్వాసమే గెలిపించింది
వివాహం స్త్రీని ఏమీ సాధించనివ్వదని ఒక అపోహ. వివాహం జరిగి, పిల్లలు పుట్టి, 40 ఏళ్లు వచ్చేశాక స్త్రీలు ఎంతకూ సాధించే అవకాశం లేదనేది తిరుగులేని అపోహ. కాని– ఈ అపోహలన్నీ తప్పు అని నిరూపించారు దివ్యా బొల్లారెడ్డి. 42 ఏళ్ల వయసులో ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో వింటిని వొదిలిన బాణంలా దూసుకువెళ్లి ఆమె స్వర్ణపతకాన్ని సాధించారు. అంతేకాదు ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో ఎంట్రీ పొందారు. దైవం మీద తనకున్న విశ్వాసమే ఈ గెలుపును ఇచ్చిందని, ఈ గెలుపు దైవానిదేనని ఆమె వినమ్రంతో సాక్ష్యం చెబుతున్నారు. ఈ నెల మొదటివారంలో మలేసియాలోని కుచింగ్‌లో ‘ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్’ జరిగాయి. 35 ఏళ్లు పైబడినవారు ఈ పోటీలలో పాల్గొనడానికి అర్హులు. ఆసియా ఖండంలోని 29 దేశాల నుంచి 2,500 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అంతపోటీని ఎదుర్కొని కూడా 40 ఏళ్ల విభాగంలో మన దేశానికి 800 మీటర్ల పరుగుపోటీలో బంగారు పతకం, 400 మీటర్ల పరుగుపోటీలో రజతపతకం సాధించారు నలభై రెండేళ్ల దివ్యారెడ్డి. ఆమె కేవలం అథ్లెట్ మాత్రమే కాదు. మీడియా రంగంలో ఉన్నతోద్యోగి కూడా. తెలుగు ప్రాంతాల స్త్రీలనే కాదు, దేశంలో ఉన్న స్త్రీలకు కూడా స్ఫూర్తినిచ్చే ఆసక్తికరమైన కథను ఆమె సాక్షితో పంచుకున్నారు. ఆటలు తెలియవు మాది రాయలసీమే అయినా హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. ఇక్కడ బిఎస్సీ చేసి అమెరికాలో కంప్యూటర్స్‌లో ఎం.ఎస్ చేశాను. చదువులో చురుగ్గా ఉన్నాను కాని ఆటలు పెద్దగా ఇంట్రస్ట్ ఉండేది కాదు. మా కుటుంబాలలో మగవారు కొందరు ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టి కృషి చేయడం తెలుసు. స్త్రీలకు ఆ విషయంపై ప్రత్యేక శ్రద్ధ ఉండేది కాదు. అందరూ ఆడుకునే చిన్న చిన్న ఆటలు ఆడుకోవడం, నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఒలింపిక్స్ పోటీలను టీవీలో చూడటం తప్ప నేను ఈ రంగానికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. వివాహం జరిగి, పిల్లలు పుట్టాక అనుకోకుండా ఈ రంగంలో అడుగుపెట్టాను. బాబు పుట్టాక... నాకు ఒక పాప. ఒక బాబు. బాబు పుట్టాక సంవత్సరం తర్వాత ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టాలనిపించింది. ఇంట్లోనే ట్రెడ్మిల్ మీద రన్నింగ్ చేయడం మొదలెట్టాను. నేను సన్నగా ఉండటం, ట్రెడ్మిల్ మీద ఉత్సాహంగా పరిగెత్తడం చూసిన ఒక స్నేహితురాలు ‘బాగా పరిగెడుతున్నావ్... రోడ్‌రేస్‌లో పాల్గొనచ్చు కదా’ అని సలహా చెప్పింది. 2013లో అనుకుంటాను సిటీలో ‘బిట్స్ పిలాని యానివర్సరీ 10కె రన్’ జరిగింది. అందులో పాల్గొనమని అందరూ ప్రోత్సహించారు. నాకు అంతవరకూ ఆ దృష్టి లేదు. సరే.. స్నేహితులతో సరదాగా ఉంటుందని పాల్గొన్నాను. 10కె రన్ అంటే సామర్థ్యాన్ని కొనసాగించే శక్తి ఉండాలి. ఆ దేవుడి కృప వల్ల అది నాకున్నట్టుంది. పోటీలో మూడో స్థానంలో వచ్చాను. అందరూ మెచ్చుకున్నారు. ఇక మీదట పరుగు మీద దృష్టి పెట్టాలని సూచించారు. అలా పరుగు మీద ఆసక్తి కలిగింది. పిల్లల స్ఫూర్తితో మా పిల్లలు స్విమ్మర్లు. పాపకు 15, బాబుకి 12 సంవత్సరాలు. ప్రాక్టీసు కోసం రోజూ వెంటబెట్టుకుని వెళ్తుంటాను. నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే బాబు ఆశ్రయ్ సైకిలింగ్ చేస్తూ నాకు తోడుగా ఉంటాడు. పిల్లలిద్దరూ రెండు మూడు గంటలు ప్రాక్టీస్ చేస్తారు. ఈతే కాదు, ఏ క్రీడ అయినా శరీరాన్ని గొప్ప క్రమశిక్షణతో ఉంచుతుందని ఆ ప్రాక్టీస్ చూస్తే నాకు అనిపించేది. గృహిణిగా, ఉద్యోగిగా నాకు ఎన్ని బాధ్యతలు ఉన్నా నేను పరుగు మీద దృష్టి పెట్టడానికి ఈ స్ఫూర్తి ఒక కారణం. ట్రెడ్మిల్ మీద 10 కిలోమీటర్ల దూరాన్ని గంటా మూడు నిమిషాల్లో పూర్తి చేయడం నాకు నేనే ప్రాక్టీసు చేశాను. దానిని ఒక్కో నిమిషం తగ్గించుకుంటూ ఇప్పుడు 49 నిమిషాలలో పూర్తయ్యేలా సాధన చేశాను. ‘ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్’లో సాధించిన బంగారు, రజత పతకాలతో దివ్యా బొల్లారెడ్డి దైవం ఇచ్చిన విజయం నేను ఇలా ఈ స్థాయికి వచ్చానంటే అదంతా దేవుడు నాయందు చూపిన కరుణ వల్లే అని అనుకుంటాను. తాత ముత్తాతల నుంచి దైవ విశ్వాసులుగా ఉన్న మా కుటుంబం ఆశీస్సులు ముఖ్యంగా మా అమ్మ ప్రార్థనలు నాకు మానసికంగా, శారీరకంగా ఎంతో బలాన్నిచ్చాయి. గృహిణిగా, ఉద్యోగిగా ఉన్న నేను అథ్లెట్‌గా మారడం కేవలం ఆ దేవుడి గొప్పతనం వల్లే అనిపిస్తుంది. నా కోసం ఆయన రచించిన ప్రణాళిక వల్లే నేను అథ్లెట్ కాగలిగాను. ఆయన గొప్పతనం చాటడానికే నాకు విజయం చేకూరింది అని కూడా నా విశ్వాసం. పిల్లలతో, ఉద్యోగంతో అలిసిన ప్రతిసారి నాకు బైబిల్ ఒక ఉత్సాహాన్ని ఇచ్చేది. నేను ఇక నా వల్ల కాదు, వెనక్కు మరలుదాం అనుకున్నప్పుడల్లా ‘డెయిలీ బ్రెడ్’ నాకు ఎంతో ప్రేరణనిచ్చేది. అన్నిటినీ మించి క్రిస్టమస్ వేడుకలు జరిగే డిసెంబర్ మాసంలో నేను అసియా పోటీలలో విజయం సాధించడాన్ని కూడా నేను దైవ విజయంగానే భావిస్తాను. – దివ్యారెడ్డి హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్... సరదాగా మొదలైన నా పరుగు ఇప్పుడు హాఫ్ మారథాన్ (21 కి.మీ)కు చేరింది. హైదరాబాద్‌లో జరిగిన ఎయిర్టెల్ హాఫ్‌మారథాన్‌లో పాల్గొని అన్ని కిలోమీటర్లు పరిగెత్తగలనని నిరూపించాను. ఆ తర్వాత 2016లో ముంబైలో జరిగిన ‘టాటా ముంబై మారథాన్’లో ఫుల్ మారథాన్ (42 కి.మీ) పరిగెత్తాను. అయితే ఏ సాధనకైనా ట్రైనర్ అవసరమని అర్థమయ్యాక రాజశేఖర్ కాలివెంకట దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాను. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ విభాగానికి డైరెక్టర్ అయిన మా కోచ్ నేను స్ప్రింట్‌లో (తక్కువ దూరపు పరుగు) పాల్గొంటే బాగుంటుందని సూచించారు. అంతేకాదు... స్పోర్ట్ సైన్స్, న్యూట్రిషన్లో పీహెచ్డీ చేసి ఉండడంతో నా డైట్లో కూడా మార్పులు చెప్పారు. ఇక స్ప్రింట్‌లో అంటే పూర్తిస్థాయి అథ్లెటిక్‌గా మారాలి. గాయాల ప్రమాదం ఉంటుంది. చాలా శారీరక శ్రమ చేయాలి. డైట్ పాటించాలి. చాలామంది వద్దు అని వారించారు. కాని నేను అవన్నీ చేశాను. జూలై 2019లో గోవాలో జరిగిన ‘నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో’ 800 మీటర్ల పరుగులో, 400 మీటర్ల పరుగులో కూడా గోల్డ్ సాధించేసరికి ఆసియా అథ్లెటిక్స్‌కు క్వాలిఫై అయ్యాను. కోచ్ రాజశేఖర్ కాలివెంకటతో దివ్య ఆసియా గోల్డ్ మలేసియాలో జరిగిన 800 మీటర్ల పరుగును నేను మర్చిపోలేను. నాతోపాటు ఫీల్డ్‌లో 13 మంది ఉన్నారు. కాని దైవాన్ని తలుచుకుని, దేశాన్ని తలుచుకుని ఒక్కసారిగా పరుగు తీశాను. లక్ష్యం పూర్తి చేసేసరికి కరతాళధ్వనులు మిన్నంటాయి. ఇండియాకు గోల్డ్ అని ప్రకటించారు. చాలా ఉద్వేగం కలిగింది. 400 మీటర్ల పరుగులో రజతం సాధించడం కూడా చాలా సంతోషం కలిగించింది. ఇప్పుడు నా దృష్టి అంతా వచ్చే సంవత్సరం టొరెంటో (కెనడా)లో జరిగే ‘వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్’పైనే. దైవం తోడుగా అక్కడ కూడా విజయం సాధిస్తానని ఆశిస్తాను. – సాక్షి ఫీచర్స్ డెస్క్ -
‘ఆసియా మాస్టర్స్’లో దివ్యారెడ్డికి మరో స్వర్ణం
కుచింగ్: మలేసియాలో జరుగుతోన్న ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 40 ఏళ్ల మహిళల వయో విభాగం 1500మీ. పరుగులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అథ్లెట్ బొల్లారెడ్డి దివ్యారెడ్డి స్వర్ణ పతకం సాధించారు. అంతకుముందు మలేసియాలోని సారావక్‌లో జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్‌లో దివ్యా రెడ్డి రెండు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల వయో విభాగంలో 800 మీటర్ల కేటగిరీలో విజేతగా నిలిచి స్వర్ణం సొంతం చేసుకోగా... 400 మీటర్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 800 మీటర్ల ఫైనల్లో దివ్యా రెడ్డి అందరికంటే ముందుగా 2 నిమిషాల 53.64 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా అవతరించింది. గో తెంగ్ యిన్ (మలేసియా– 2ని:54.15 సెకన్లు) రజతం... అమితా కనెగాంకర్ (భారత్–2ని:54.73 సెకన్లు) కాంస్యం సాధించారు. -
దివ్యా రెడ్డికి రెండు పతకాలు
ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ మహిళా అథ్లెట్ దివ్యా రెడ్డి రెండు పతకాలు సాధించింది. మలేసియాలోని సారావక్‌లో జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్‌లో దివ్యా రెడ్డి 40 ఏళ్ల వయో విభాగంలో 800 మీటర్ల కేటగిరీలో విజేతగా నిలిచి స్వర్ణం సొంతం చేసుకోగా... 400 మీటర్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 800 మీటర్ల ఫైనల్లో దివ్యా రెడ్డి అందరికంటే ముందుగా 2 నిమిషాల 53.64 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా అవతరించింది. గో తెంగ్ యిన్ (మలేసియా– 2ని:54.15 సెకన్లు) రజతం... అమితా కనెగాంకర్ (భారత్–2ని:54.73 సెకన్లు) కాంస్యం సాధించారు. -
దివ్యా రెడ్డికి నాలుగు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ మహిళల మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అథ్లెట్ దివ్యా రెడ్డి నాలుగు పతకాలతో మెరిసింది. గోవాలో ఆదివారం జరిగిన ఈ పోటీల్లో దివ్యా రెడ్డి రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించారు. ప్లస్ 35 వయో విభాగంలో పోటీపడిన దివ్యా రెడ్డి 400 మీటర్లు (1ని:15.29 సెకన్లు), 800 మీటర్ల (3ని:03 సెకన్లు) విభాగంలో పసిడి పతకాలు గెలిచారు. 1500 మీటర్ల (6ని:41 సెకన్లు) విభాగంలో ఆమె మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. దివ్యా రెడ్డి సభ్యురాలిగా ఉన్న తెలంగాణ బృందం 4100 మీటర్ల రిలే (1ని:07 సెకన్లు) రేసులో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకున్నారు. విజేత హోదాలో దివ్యా రెడ్డి ఈ ఏడాది డిసెంబర్లో కౌలాలంపూర్‌లో జరిగే ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని సంపాదించారు. -
దివ్యా రెడ్డికి మూడు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మాస్టర్స్ మహిళల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో దివ్యా రెడ్డి మూడు స్వర్ణాలతో మెరిసారు. 40 ప్లస్ వయో విభాగంలో పోటీపడిన ఆమె 400, 800,1500 మీటర్ల పరుగు పందెంలో విజేతగా నిలిచారు. 400 మీ. పరుగు పోటీని దివ్య ఒక నిమిషం 22.2 సెకన్లలో పూర్తి చేశారు. ఇందులో కృతి (1ని:30.1 సెకన్లు), ఉమా గుప్తా (1ని:40.5 సె.) వరుసగా రజతం, కాంస్యం గెలిచారు. 800 మీటర్ల విభాగంలో 3 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేశారు. అనంతరం 1500 మీటర్ల పరుగును దివ్య అందరికంటే ముందుగా 7 నిమిషాల 03 సెకన్లలో పూర్తి చేశారు. కృతి (7ని:21.3 సె.)కి రజతం దక్కింది. 45 ప్లస్ వయో విభాగం జరిగిన లాంగ్‌జంప్‌లో కృష్ణవేణి బంగారు పతకం సాధించారు. ఆమె 2.42 మీటర్ల దూరంలో దూకి విజయం సాధించగా, కుసుమ (2.40 మీ.) రజతంతో తృప్తిపడ్డారు. ఇతర పోటీల ఫలితాలు 35 ప్లస్ వయో విభాగం: 100 మీ. పరుగు: 1. ప్రియాంక, 2. సరిత, 3. విజయ; 200 మీ. పరుగు: 1. విజయ, 2. సంధ్య, 3. ఉమ; 1500 మీ. పరుగు: 1. సంధ్య, 2. ఇందు; లాంగ్‌జంప్: 1. ప్రియాంక, 2. విజయ, 3. సమత; షాట్‌పుట్: 1. అశ్విని, 2. ప్రమీల, 3. ప్రియాంక; డిస్కస్ త్రో: 1. ప్రమీల, 2. అశ్విని; 3. కమల; జావెలిన్ త్రో: 1. రోజా, 2. శశిరేఖ, 3. వినీశ; హ్యామర్ త్రో: 1. రోజా, 2.ప్రమీల, 3. శశిరేఖ; 5000 మీ. రేస్‌వాక్: 1. అరుణ, 2. విజయ, 3. జయలక్ష్మి. 40 ప్లస్ విభాగం: 100 మీ. పరుగు: 1.ఉమా గుప్తా, 2. కృష్ణవేణి; 200 మీ. పరుగు: 1. ఉమా గుప్తా, 2. రోజా, 3. శకుంతల; లాంగ్‌జంప్: 1. విజయ, 2. కృష్ణవేణి; షాట్‌పుట్: 1.వర్జినియా బెన్సమ్, 2. షాలిని; డిస్కస్ త్రో: 1. సునీత, 2. కుసుమ, 3.స్వరూప; జావెలిన్ త్రో: 1.ప్రిస్కిలా, 2. మేరి, 3.స్నేహలత; హ్యామర్ త్రో: 1. అల్తియా, 2. ప్రిస్కిలా; 5000 మీ. రేస్‌వాక్: 1. శకుంతల, 2. కృష్ణవేణి, 3. స్నేహలత. 45 ప్లస్ విభాగం: 100 మీ. పరుగు: 1. సుమ, 2. జ్యోతి, 3. కృష్ణవేణి; 200 మీ. పరుగు: 1. సుమ, 2. జ్యోతి, 3. తులసి; 1500 మీ. పరుగు: 1. తులసి, 2. జ్యోతి; లాంగ్‌జంప్: 1. కృష్ణవేణి, 2. కుసుమ; షాట్‌పుట్: 1.కుసుమ; షాట్‌పుట్ 50 ప్లస్: 1. భాను; డిస్కస్ త్రో: 1. సునీత, 2. కుసుమ; జావెలిన్ త్రో: 1.సుమ, 2. సునీత; హ్యామర్ త్రో: 1. కుసుమ, 2. సునీత. 50 ప్లస్ విభాగం: 100 మీ. పరుగు: 1. శాంత, 2. సలోమి; డిస్కస్ త్రో: 1. భాను, 2. అనితారాణి, 3. రూపా ఠాకూర్; జావెలిన్ త్రో: 1. భాను, 2. వరలక్ష్మి; 5000 మీ. రేస్‌వాక్: 1.శాంత, 2. అనితారాణి. 60 ప్లస్ విభాగం: 100 మీ. పరుగు: 1.శారద, 2. దుర్గ; డిస్కస్ త్రో: 1. దేబర, 2. డార్కస్, 3. శారద; జావెలిన్ త్రో: 1. దేబర, 2. డార్కస్; షాట్‌పుట్: 1. దేబర రేమండ్, 2. డార్కస్; 5000 మీ. రేస్‌వాక్: 1. శారద; 70 ప్లస్: 1. దుర్గ. -
నువ్వు మాస్‌రా...
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల హీరోగా నటించిన చిత్రం ‘నువ్వు తోపురా’. హరినాథ్ బాబు.బి దర్శకత్వంలో బేబి జాహ్నవి సమర్పణలో యునైటెడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఎస్.జె.కె.ప్రొడక్షన్స్ (యు.ఎస్.ఎ) వారి సహకారంతో డి.శ్రీకాంత్ నిర్మించారు. గీతా ఆర్ట్స్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది. బి.హరినాథ్ మాట్లాడుతూ– ‘‘మాస్, థ్రిల్లర్ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘మా చిత్రం గీతా ఆర్ట్స్, జి3 ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా విడుదలవుతుండం ఆనందంగా ఉంది. ఇందుకు అల్లు అరవింద్‌గారికి, ‘బన్ని’ వాసుగారికి థ్యాంక్స్’’ అన్నారు శ్రీకాంత్. ‘‘అమెరికాలోని అత్యంత అందమైన ప్రదేశాలైన సాల్ట్ లేక్ సిటీ, ప్రొవో తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్రమిది. మంచి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం’’ అని చిత్ర సహ నిర్మాత డా.జేమ్స్ వాట్ కొమ్ము(యు.ఎస్.ఎ) అన్నారు. నిత్యాశెట్టి, నిరోషా, రవివర్మ, శ్రీధరన్, దివ్యా రెడ్డి, ‘జెమిని’ సురేష్, దువ్వాసి మోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్: రితేష్ కుమార్, కెమెరా: ప్రశాష్ వేళాయుధన్, వెంకట్ సి.దిలీప్, సంగీతం: సురేష్ బొబ్బలి, ఆమెరికా లైన్ ప్రొడ్యూసర్: స్టెపెనీ ఒల్లర్టన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవివర్మ దంతులూరి. -
దివ్యదృష్టి
చిన్నారుల ఆరోగ్యానికి, వారి ఎదుగుదలకు పాలు చాలా దోహదం చేస్తాయి. మరి రోజూ మనం తాగే పాలు మంచివేనా అంటే.. సమాధానం లేదు. ప్యాకెట్పాలలో రసాయనాలు కలిపి కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు కొందరు స్వార్థపరులు. దీంతో ఆలోచించిన దివ్యారెడ్డి స్వచ్ఛమైన పాలనే (దేశీయ ఆవులు, గేదెలు ఇచ్చే పాలు) అందజేయాలని నిర్ణయించి ఆ వైపు అడుగులు వేశారు. హైబ్రిడ్ ఆవులు, గేదెలు ఇచ్చే పాలను ఎ1 పాలు అంటారు. ఈ పాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. నిత్యం పిల్లలు ఎ1 పాలు తాగితే అనారోగ్యం బారిన పడే ప్రమాదముంది. దేశీయ ఆవులు ఇచ్చే పాలను ఎ2 పాలు అంటారు. దేశీయ ఆవు పాలు, నెయ్యి, ఇతర ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేకూర్చుతాయి.ఎదిగే పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఆన్లైన్లోనేఆర్డర్.. ఆన్లైన్, ఫోన్లో ఆర్డర్ చేస్తే గుమ్మం ముందుకే పాలు, నెయ్యి డోర్ డెలివరీ చేస్తున్నారు. పాలు పితికిన కొద్ది క్షణాల్లోనే స్టీల్ బాటిల్స్‌లో పాలను నింపుతారు. అక్కడి నుంచి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు. పరిశుభ్రమైన వెన్న, నెయ్యి కూడా తయారు చేస్తున్నారు. పిల్లల కోసం.... గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్‌లో నివాసం ఉండే అల్లోల దివ్యారెడ్డి దేశీయ ఆవులను పెంచాలని నిర్ణయించారు. ఎ1, ఎ2 పాలకు ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకున్నారు. 2015లో గుజరాత్ వెళ్లి పలు గోశాలలను సందర్శించారు. సంగారెడ్డి సమీపంలో ఓల్డ్ ముంబాయ్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఫార్మ్‌లో దేశీయ ఆవులైన గిర్ జాతికి చెందిన 15 ఆవులతో ‘క్లిమమ్ వెల్నెస్ అండ్ ఫార్మ్స్’ను ప్రారంభించి సరఫరా చేయడం ప్రారంభించారు. ఉత్తమ స్పందన రావడంతో 200 గిర్ ఆవులను కొనుగోలు చేశారు. ఈ ఫార్మ్ నేడు స్టార్టప్‌గా మారింది. అనేక అవార్డులు, ప్రశంసలు ♦ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్– సాక్షి ఎక్సిలెన్స్ అవార్డ్–2017 ♦ నేషనల్ గోపాల రత్న–2018 అవార్డ్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు. ♦ ఎకో కాన్షియస్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్–2016 అవార్డును సౌత్ సోకప్ అండ్ రిట్జ్ మ్యాగజైన్ అంద జేసింది. దేశీయ ఆవుల సంతతిపెంచాలి... అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, సౌతాఫ్రికా లాంటి దేశాల మన దేశీయ ఆవులను పెంచుకునేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. ఆవుల మల, మూత్రాలతో చేపట్టే సేంద్రీయ వ్యవసాయం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దేశీయ ఆవుల సంతతిని పెంచేందుకు చాలా మందికి అవగాహన కల్పించాం. – అల్లోల దివ్యారెడ్డి -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్టార్టప్ అల్లోల దివ్యారెడ్డి
-
సాక్షి ఫన్ రన్
-
అపర్ణకౌంటీలో రన్ ఫర్ ఫన్!
-
‘సాక్షి’ మొబైల్ యాప్‌కి విశేష స్పందన
⇒ డిజిటల్ టెక్నాలజీతోనే పాఠకులకు మరింత చేరువ ⇒ డిజిటల్ మీడియా సదస్సులో ‘సాక్షి’ డిజిటల్ మీడియా, ఐటీ ప్రెసిడెంట్ దివ్యారెడ్డి సాక్షి, న్యూఢిల్లీ : అన్ని వర్గాల పాఠకులకు వార్తలను తక్కువ సమయంలో చేరవేసేందుకు డిజిటిల్ మీడియా ఎంతో ఉపకరిస్తుందని ‘సాక్షి’ డిజిటల్ మీడియా, ఐటీ ప్రెసిడెంట్ దివ్యా బొల్లారెడ్డి అన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం విరివిగా పెరిగిపోతున్న ఈ సమయంలో అన్ని వర్గాల పాఠకులను, ముఖ్యంగా యువతను మరింతగా ఆకర్షించేందుకు సోషల్ మీడియాతోపాటు సరికొత్త యాప్స్ వాడాల్సిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. ఢిల్లీలో మంగళవారం డిజిటల్ మీడియా ఇండియా-2015 సదస్సుకు దివ్యారెడ్డి హాజరయ్యారు. బీబీసీ సహా ప్రపంచస్థాయి మీడియా సంస్థలకు చెందిన పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ మీడియాలో వస్తున్న మార్పులు, పాఠకుల అవసరాలకు తగ్గట్టుగా చేసుకోవాల్సిన మార్పులు సహా పలు అంశాలపై చర్చించారు. సదస్సులో భాగంగా ‘ఏ కేస్ స్టడీ ఆన్ ది డిజిటల్ కంటెంట్ స్ట్రాటజీ ఆఫ్ సాక్షి డెయిలీ’ అన్న అంశంపై దివ్యారెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలుగు భాషలో సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ, సాక్షి డాట్‌కామ్ ద్వారా వార్తలను, వార్తా కథనాలను మరింత వేగవంతంగా చేరువచేసేందుకు తీసుకుంటున్న చర్యలు, టెక్నాలజీలో తీసుకువచ్చిన మార్పులను వివరించారు. సాక్షి వెబ్ మీడియాలో తాజా వార్తలను అందించడంతోపాటు రోజువారీ పత్రికలో, టీవీలో వచ్చే వార్తలతోపాటు ఆ వార్తకు సంబంధించిన అదనపు సమాచారాన్ని, ఒక సంఘటనకు సంబంధించిన అదనపు ఫొటోలను, వీడియోలను వీలైనన్ని ఎక్కువ పాఠకులకు చేరువ చేసేలా తీర్చిదిద్దినట్టు చెప్పారు. వార్తల్లో నాణ్యత లోపించకుండా అంతర్గతంగా ఎలాంటి వ్యవస్థను రూపొందించుకోవాలనే అంశాలను వివరించారు. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలోనూ పాఠకుడితో అనుబంధాన్ని కొనసాగించేందుకు తీసుకుంటున్న చర్యలను తెలిపారు. కొత్తగా ప్రారంభించిన సాక్షి మొబైల్ యాప్‌కి సైతం విశేష స్పందన లభిస్తోందన్నారు. దీనిలో యూజర్ జనరేటెడ్ కంటెంట్(యూజీసీ)వినియోగంతో వీక్షకుడితో అనుబంధాన్ని కొనసాగించే అవకాశం ఉందన్నారు. దీనిలో వీక్షకులను సహ భాగస్వామ్యులను చేస్తూ వారు పంపే ఫొటోలను వెబ్‌లో పెడుతున్నామని తెలిపారు. డిజిటల్ మీడియాని వినియోగించే వారిలో యువత శాతం ఎక్కువగా ఉంటున్నందున వారిని ఆకట్టుకునేలా వార్తాంశాలను ఎంపిక చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. టీవీలో వచ్చే వార్తను మరెప్పుడైనా నచ్చిన సమయంలో చూసేలా తక్కువ నిడి వి ఉన్న వీడియోలను మొబైల్ యాప్‌లో పెట్టడం, అందుకు సబంధించిన సమాచారాన్ని టెక్ట్స్ రూపంలో ఇవ్వడంతో వీక్షకుడికి మరింత వెసులుబాటుగా ఉంటోందన్నారు. డిజిటల్ మీడియాలో వస్తున్న మార్పులతో ఎప్పటికప్పుడు నవీనీకరించుకుంటే మరింతగా పాఠకులకు, వీక్షకులకు చేరువకావొచ్చని అన్నారు. -
'వేగం, కచ్చితత్వం.. సాక్షి డాట్‌కామ్'
-
వేగం, కచ్చితత్వం.. సాక్షి డాట్‌కామ్: దివ్యారెడ్డి
న్యూఢిల్లీ: వేగం, కచ్చితత్వంతో కూడిన వార్తలను అందించేందుకు సాక్షి మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తుందని సాక్షి గ్రూపు ఐటీ ప్రెసిడెంట్ దివ్యారెడ్డి అన్నారు. సాక్షి మీడియా పనితీరు గురించి నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాకు వివరించారు. ఢిల్లీలో జరుగుతున్న వాన్ ఇన్ఫ్రా రెండు రోజుల సదస్సులో దివ్యారెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ మీడియా దిగ్గజం బీబీసీ సహా పలు ఇంటర్నేషనల్, నేషనల్, రీజినల్ మీడియా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. డిజిటల్ ప్లాట్‌ఫాంలో విప్లవాత్మక మార్పులను, భవిష్యత్తులో చోటు చేసుకోబోయే మార్పులను సదస్సులో చర్చించారు. వినూత్న మార్పులతో సాక్షి డాట్ కామ్ ఇంటర్నెట్ ప్రపంచంలో ఎలా దూసుకుపోతోందో దివ్యారెడ్డి వివరించారు.