దివ్యా రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జాతీయ మహిళల మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అథ్లెట్ దివ్యా రెడ్డి నాలుగు పతకాలతో మెరిసింది. గోవాలో ఆదివారం జరిగిన ఈ పోటీల్లో దివ్యా రెడ్డి రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించారు. ప్లస్ 35 వయో విభాగంలో పోటీపడిన దివ్యా రెడ్డి 400 మీటర్లు (1ని:15.29 సెకన్లు), 800 మీటర్ల (3ని:03 సెకన్లు) విభాగంలో పసిడి పతకాలు గెలిచారు. 1500 మీటర్ల (6ని:41 సెకన్లు) విభాగంలో ఆమె మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. దివ్యా రెడ్డి సభ్యురాలిగా ఉన్న తెలంగాణ బృందం 4100 మీటర్ల రిలే (1ని:07 సెకన్లు) రేసులో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకున్నారు. విజేత హోదాలో దివ్యా రెడ్డి ఈ ఏడాది డిసెంబర్‌లో కౌలాలంపూర్‌లో జరిగే ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని సంపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment