
పాకిస్తాన్ దిగ్గజ అథ్లెట్ అబ్దుల్ ఖాలిఖ్. అప్పట్లో ఆయనకు ఆసియాలోనే అత్యంత వేగవంతమైన రన్నర్‌గా పేరుంది. అంతటి పరుగు వీరుడ్ని అది కూడా వారి గడ్డమీదే ఓడించిన ఘనత మన సింగ్‌ది. 1960లో జరిగిన ఇండోృపాక్ స్పోర్ట్స్ మీట్‌లో 200 మీటర్ల పరుగులో మిల్కా అతన్ని ఓడించి పసిడి పట్టాడు.
సింగ్ పరుగుకు ముగ్ధుడైన అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్... ‘ఫ్లయింగ్ సిఖ్’ బిరుదుతో మిల్కాను సత్కరించారు. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో మరో రెండు స్వర్ణాలు (400 మీ., 4్ఠ400 రిలే) సాధించాడు. 1964లో రిటైరైన మిల్కా ఆర్మీ ఉద్యోగాన్ని కూడా వదిలేసి పంజాబ్ రాష్ట్రంలోనే క్రీడాధికారిగా ఉన్నత ఉద్యోగం చేశాడు. అతని జీవిత గాథతో బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘బాగ్ మిల్కా బాగ్’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment