ఫిల్మ్‌ఫేర్‌లో ‘మిల్కా’ జోరు | 'Bhaag Milkha Bhaag' bags big three at Filmfare Awards | Sakshi
Sakshi News home page

ఫిల్మ్‌ఫేర్‌లో ‘మిల్కా’ జోరు

Published Sun, Jan 26 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

ఫిల్మ్‌ఫేర్‌లో ‘మిల్కా’ జోరు

ఫిల్మ్‌ఫేర్‌లో ‘మిల్కా’ జోరు

ముంబై: ‘ఫ్లయింగ్ సిఖ్’ మిల్కాసింగ్ జీవితం ఆధారంగా వచ్చిన బాలీవుడ్ సినిమా ‘భాగ్ మిల్కా భాగ్’కు 59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల పంటపండింది. 2013కు గానూ ఉత్తమ చిత్రం, నటుడు, దర్శకత్వం, గీతం, ప్రొడక్షన్ డిజైన్, దుస్తులు విభాగాల్లో ఆ చిత్రం అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ నటి అవార్డును ‘గలియోంకా రాస్‌లీలా రామ్‌లీలా’ చిత్రానికి గానూ దీపికా పదుకొణే దక్కించుకుంది. తమిళ నటుడు ధనుష్ ఉత్తమ కొత్త నటుడి అవార్డు గెలుచుకున్నాడు.
 
 అవార్డుల వివరాలు
 -    ఉత్తమ నటుడు: ఫర్హాన్ అక్తర్ (భాగ్ మిల్కా భాగ్)
-    ఉత్తమ నటి: దీపికా పదుకొణే (గలియోంకా రాస్‌లీలా రామ్‌లీలా)
-    ఉత్తమ దర్శకుడు: రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా (భాగ్ మిల్కా భాగ్)
-   సోనీ ట్రెండ్ సెట్టర్ ఆఫ్ ది ఇయర్: చెన్నై ఎక్స్‌ప్రెస్
-   జీవితసాఫల్య అవార్డు: తనూజ
-   ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్ (తుమ్‌హీ హో-ఆషిఖీ-2)
-   ఉత్తమ గాయని: మోనాలీ ఠాకూర్ (సావర్‌లూన్- లుటేరా)
-  ఉత్తమ గీతం: ప్రశూన్ జోషి (జిందా- భాగ్
 మిల్కా భాగ్)
-    బెస్ట్ వీఎఫ్‌ఎక్స్: టాటా ఎలిక్సిస్ (ధూమ్-3)
 ఇక్కడి వైఆర్‌ఎఫ్ స్టూడియోలో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆదివారం సోనీ టీవీ ప్రసారం చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement