న్యూయార్క్: ప్రపంచంలో అటు ప్రైజ్‌మనీ, ఇటు ప్రకటనల రూపంలో అత్యధిక ఆదాయం పొందుతున్న క్రీడాకారిణుల జాబితాలో బ్యాడ్మింటన్ తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధుకు చోటు దక్కింది. 2017 జూన్ నుంచి 2018 జూన్ వరకు అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ల వివరాలతో ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజా నివేదిక విడుదల చేసింది. ఇందులో 85 లక్షల డాలర్ల (రూ. 59 కోట్లు) సంపాదనతో సింధు ఏడో స్థానంలో నిలిచింది. టోర్నీలు ఆడటం ద్వారా సింధు ప్రైజ్‌మనీ రూపంలో ఐదు లక్షల డాలర్లు... వాణిజ్య ఒప్పందాల ద్వారా 80 లక్షల డాలర్లు సంపాదించింది. భారత్ నుంచి ఈ ఘనత అందుకున్న ఏకైక క్రీడాకారిణి ఆమెనే కావడం విశేషం. టాప్–10 జాబితాలో రేస్ కార్ డ్రైవర్ డానికా ప్యాట్రిక్ (75 లక్షల డాలర్లు), సింధు మినహా మిగతా వారంతా టెన్నిస్ స్టార్లే. అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ కోటీ 81 లక్షల డాలర్లు (రూ.126 కోట్లు) వరుసగా మూడో ఏడాదీ అగ్రస్థానం దక్కించుకుంది.
టాప్–10 జాబితా
1. సెరెనా (అమెరికా) కోటీ 81 లక్షల డాలర్లు (రూ. 126 కోట్లు); 2. వొజ్నియాకి (డెన్మార్క్) కోటీ 30 లక్షల డాలర్లు (రూ. 90 కోట్లు); 3. స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) కోటీ 12 లక్షల డాలర్లు (రూ. 78 కోట్లు); 4. ముగురుజా (స్పెయిన్) కోటీ 10 లక్షల డాలర్లు (రూ. 76 కోట్లు); 5. షరపోవా (రష్యా) కోటీ 5 లక్షల డాలర్లు (రూ. 73 కోట్లు); 6. వీనస్ విలియమ్స్ (అమెరికా) కోటీ 2 లక్షల డాలర్లు (రూ. 71 కోట్లు); 7. పీవీ సింధు (భారత్) 85 లక్షల డాలర్లు (రూ. 59 కోట్లు); 8. హలెప్ (రొమేనియా) 77 లక్షల డాలర్లు (రూ. 53 కోట్లు); 9. డానికా ప్యాట్రిక్ (అమెరికా) 75 లక్షల డాలర్లు (రూ. 52 కోట్లు); 10. కెర్బర్ (జర్మనీ) 70 లక్షల డాలర్లు (రూ. 48 కోట్లు).
ఆర్జనలోనూ సింధు గర్జన
Published Thu, Aug 23 2018 1:03 AM | Last Updated on Thu, Aug 23 2018 5:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment