అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్. చిత్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు
కవాడిగూడ: వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే అని, అందుకే అల్లూరి సీతారామరాజు జయంతిని తెలంగాణలో అధికారికంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీతారామరాజు 125వ జయంతిని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సోమవారం ట్యాంక్‌బండ్‌పై అధికారికంగా నిర్వహించింది. మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, మాధవరం కృష్ణారావు, వివేకానంద, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంబీర్‌పూర్ రాజు, నవీన్‌లు ట్యాంక్‌బండ్‌పై ఉన్న సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ జల్ జమీన్ జంగల్ కోసం కొము రం భీమ్ పోరాడారని, అల్లూరి కూడా బ్రిటిష్ పాలకులతో పోరాడి ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. క్షత్రియుల కోసం కేసీఆర్ మూడు ఎకరాల భూమిని కేటాయించారని, త్వరలో భవన నిర్మాణం పూర్తి చేసుకోవాలని, దానికి అల్లూరి పే రు పెట్టడమే సముచితమని అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ సీఎం అయిన తరువాతే వైతాళికులను గౌరవించుకోవ డం మొదలైందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు వర్మ, శ్యామలరాజు, మైనర్ రాజు, రామరాజు, వరదరాజులు, ఆఫ్గన్ రామరాజు, జోనల్ కమిషనర్ శ్రీనివా స్‌రెడ్డి, ముషీరాబాద్ సర్కిల్ 15 ఏఎంహెచ్‌వో మైత్రేయి, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, నాయకులు బీఎన్ రెడ్డి, తలసాని సాయికిరణ్, ముఠా జైసింహతోపాటు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అల్లూరి అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment