
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇటీవలి కాలంలో కేంద్రం నుంచి బీజేపీ పెద్దలు తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టండి అంటూ ప్రజలను పదే పదే కోరారు. అప్పుడే తెలంగాణకు విముక్తి కలుగుతుందని కామెంట్స్ చేశారు.
ఇలాంటి తరుణంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది కేటీఆరే. మా భవిష్యత్ నాయకుడు కేటీఆరే. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు. గతంలో చిరంజీవి వచ్చారు.. ఇప్పుడు పవన్ కల్యాణ్ వస్తారేమో? అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment