సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు తప్పుకున్న తర్వాత టీఆర్‌ఎస్ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన అన్ని అర్హతలూ కేటీఆర్‌కు ఉన్నాయని, తెలంగాణ ఉద్యమంలోనూ కేటీఆర్ క్రియాశీలకంగా పాల్గొన్నారని పేర్కొన్నారు.
గతంలోనూ టీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. కేటీఆర్‌ను సీఎంను చేసి.. కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళుతారని ఊహాగానాలూ వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కేటీఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేసీఆర్ పగ్గాలు అప్పగించారు. దీంతో కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ పార్టీని, భవిష్యత్తులో టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని నడుపుతారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment