
ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్‌లో బోటింగ్ చేస్తున్న మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు
వైరా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యా టక రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ఖమ్మం జిల్లాకు వచ్చి నప్పటికి.. ఇప్పటికీ అభివృద్ధిలో ఎంతో తేడా ఉందని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో రూ.89 లక్షలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని, వైరా రిజర్వాయర్ వద్ద టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు స్పీడ్ బోట్లను ఆదివారం ఆయన ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. వైరా రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా వైరాలో ఇండోర్ స్టేడియం ప్రారంభించాక మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతుండగా, ఉపాధి హామీ ఫీల్ట్ అసిస్టెంట్లు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment