మంచానికే పరిమితమైన శ్రీనివాస్
సాక్షి, పెద్దపల్లి: హమాలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే కార్మికుడు పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. వైద్యానికి డబ్బు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన నాగపూరి శ్రీనివాస్‌గౌడ్ నాలుగు నెలల క్రితం హైబీపీతో పక్షవాతానికి గురికాగా, కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. అతడికి భార్య శ్రీలత, ఇద్దరు కూతుర్లు అంజలి, భార్గవి ఉన్నారు. శ్రీనివాస్ పని చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. మంచానికే పరిమితం కావడంతో వైద్యంకోసం కుటుంబసభ్యులు తెలిసినవారి వద్ద రూ.10లక్షల వరకు అప్పు చేసి ఆపరేషన్ చేయించారు.
అయినా కోలుకోలేదు. నాలుగు నెలల నుంచి కుటుంబ పోషణ భారం కావడంతో ఇద్దరు ఆడపిల్లలు చదువుకు దూరమయ్యారు. వైద్యానికి దాతలు సాయం చేస్తే కోలుకుంటాడని శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మూత్రపిండాల్లో రాళ్లు తొలగింపునకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారని కుటుంబసభ్యులు రోదిస్తూ తెలిపారు. ఆపరేషన్‌కు రూ.5లక్షలు అవుతాయని, తమ వద్ద చిల్లిగవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు మానవత్వంతో సా యం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. - దాతలు సాయం చేయాల్సిన ఫోన్ పే నంబర్ : 96761 73272
Comments
Please login to add a commentAdd a comment