మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు జ్ఞాపిక అందజేస్తున్న కుల్‌దీప్ దీదీ
రాయదుర్గం (హైదరాబాద్): క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో శనివారం ‘విన్నింగ్ ది గేమ్ ఆఫ్ మైండ్’ అంశంపై స్పోర్ట్స్ కాంక్లేవ్‌ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. క్రీడలు మన నిత్యజీవితంగో ముఖ్య భాగమైపోయాయన్నారు.
ఇవి మనకు ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని కల్గించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయన్నారు. ప్రస్తుత యువత క్రీడలను తమ కెరియర్‌గా ఎంచుకుంటున్నారన్నారు. బ్రహ్మ కుమారీస్ సంస్థ ప్రపంచానికి శాంతిని అందిస్తూనే వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందన్నారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చీఫ్ ఎంఎస్‌కే ప్రసాద్ మాట్లాడుతూ.. క్రీడాకారులు జయాపజయాలను సమన్వ యం చేసుకోవడం ఎంతగానో అవసరమన్నారు.
క్రీడాకారులకి సఫలత పొందడానికి 30 శాతం శారీరక శక్తి 70 శాతం మానసికశక్తి అవసరమన్నారు. ఈ సందర్భంగా జాతీయ ఆర్చరీ కోచ్ డాక్టర్ రవిశంకర్, జాతీయ అథ్లెటిక్స్ కోచ్ రమేష్ నాగపూరి, ది హిందూ క్రీడల విభాగం డిప్యూటీ ఎడిటర్ వీవీ సుబ్రహ్మణ్యం, ప్రముఖ క్రీడా సైకాలిజిస్ట్ డాక్టర్ సి. వీరేందర్, ప్రముఖ న్యూట్రిషియనిస్ట్ ఆరాధనా శర్మ, శాంతి సరోవర్ డైరెక్టర్ బీకే కుల్‌దీప్ దీదీ, బ్రదర్ ఈవీ గిరీష్, బీకే అంజలి తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment