సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని మారుమూల పల్లెలో జన్మించి రాజుగా ఎదిగిన దివంగత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌పై వివిధ డినామినేషన్లలో పోస్టల్ స్టాంపులు ముద్రించి విడుదల చేయాలని ఎక్సైజ్ శాఖమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్ రీజినల్ పోస్ట్‌మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డిని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ లేఖ రాశారు.
17వ శతాబ్దంలో వరంగల్ జిల్లా ఘన్‌పూర్ మండలం తాటికొండలో జన్మించిన, వరంగల్ జిల్లాలోని ఖిల్లాషాపూర్ నుంచి పాలించిన నాయకుడు సర్వాయి పాపన్న అని పేర్కొన్నారు. ఆయన్ను చరిత్రకారులు బార్బరా, థామస్ మెట్‌కాఫ్ ‘రాబిన్ హుడ్–లైక్’ అని వర్ణించారని గుర్తు చేశారు. మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రజలనే సైన్యంగా నియమించుకున్న నాయకుడు సర్దార్ పాపన్న అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment