
అధికారులకు పదోన్నతుల పత్రాలు అందజేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో ఎస్సై స్థాయి నుంచి అదనపు కమిషనర్ వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులకు పదోన్నతులు లభించాయి. శనివారం ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పదోన్నతుల పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పదోన్నతులు సాధించిన ఉద్యోగులను అభినందించారు.
రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే గంజాయి, గుడుంబాలను నిర్మూలించగలిగామని చెప్పారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అజయ్‌రావు, హరికిషన్, అంజన్‌రావు, డేవిడ్ రవికాంత్, శాస్త్రి, ఖురేషి, సురేశ్‌రాథోడ్, చంద్రయ్యగౌడ్, దత్తురాజుగౌడ్, సత్యనారాయణ, రవీందర్‌రావు, గణేశ్‌గౌడ్, కిషన్‌నాయక్, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment