నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపుతాం  | Telangana Minister Srinivas Goud Reacts On Adulterated Liquor | Sakshi
Sakshi News home page

నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపుతాం 

Published Wed, Dec 21 2022 2:10 AM | Last Updated on Wed, Dec 21 2022 2:10 AM

Telangana Minister Srinivas Goud Reacts On Adulterated Liquor - Sakshi

హైదరాబాద్‌: రాష్ట్రంలో కల్తీ మద్యం సరఫరాను ఉక్కుపాదంతో అణచివేస్తామని, ఇందులో ఎంతటి వారి ప్రమేయమున్నా వదిలి పెట్టేది లేదని రాష్ట్ర ఎక్సైజ్, ప్రొబేషనరీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. హయత్‌నగర్‌ ఎక్సైజ్‌ పోలీస్టేషన్‌లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అసలు మద్యానికి ఏమాత్రం తేడా లేకుండా స్టిక్కర్లు, బాటిళ్లు, కార్టన్లు తీసుకుని వెళ్లి స్కాన్‌ చేసినా బయటపడని విధంగా ఒడిశాలోని కటక్‌ జిల్లా అభయ్‌పూర్‌ అటవీ ప్రాంతంలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారని తెలిపారు. దొరికిన ఒక బాటిల్‌ ఆధారంగా కేవలం నాలుగు రోజుల్లోనే రాష్ట్ర ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో పోలీసులు డొంకంతా కదిలించారని అభినందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement