క్షతగాత్రులను ఆదుకున్న మంత్రి  | Telangana Minister Srinivas Goud Helps Injured Persons in Road Accident | Sakshi
Sakshi News home page

క్షతగాత్రులను ఆదుకున్న మంత్రి 

Published Wed, Apr 27 2022 3:12 AM | Last Updated on Wed, Apr 27 2022 3:12 AM

Telangana Minister Srinivas Goud Helps Injured Persons in Road Accident - Sakshi

రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించి రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మానవత్వాన్ని చాటుకున్నారు. వనపర్తికి చెందిన డీసీఆర్‌బీ కానిస్టేబుల్‌ దాసరి వెంకటస్వామి, భార్య సింధు, కుమారుడు కవినందన్‌దాస్, కూతురు అద్వికతో కలసి మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి కారులో బయల్దేరారు. వీరి కారు మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం జానంపేట వద్దకు చేరుకోగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.

దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికీ స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో అడ్డాకులలో జరిగే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించారు. స్వల్ప గాయాలతో బయట పడిన క్షతగాత్రులకు నీళ్లు తాగించి స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం చేయించాలని అడిషనల్‌ కలెక్టర్‌ తేజాస్‌ నందులాల్‌ పవార్‌ను ఆదేశించారు.    
–అడ్డాకుల  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement