addakal
-
క్షతగాత్రులను ఆదుకున్న మంత్రి
రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించి రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మానవత్వాన్ని చాటుకున్నారు. వనపర్తికి చెందిన డీసీఆర్బీ కానిస్టేబుల్ దాసరి వెంకటస్వామి, భార్య సింధు, కుమారుడు కవినందన్‌దాస్, కూతురు అద్వికతో కలసి మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరారు. వీరి కారు మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట వద్దకు చేరుకోగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికీ స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో అడ్డాకులలో జరిగే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించారు. స్వల్ప గాయాలతో బయట పడిన క్షతగాత్రులకు నీళ్లు తాగించి స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం చేయించాలని అడిషనల్ కలెక్టర్ తేజాస్ నందులాల్ పవార్‌ను ఆదేశించారు. –అడ్డాకుల -
డివైడర్‌ను ఢీకొన్న బైక్
అడ్డాకుల : గద్వాల పట్టణానికి చెందిన తెలుగు ప్రవీణ్‌కుమార్ (21) ప్రస్తుతం హైదరాబాద్‌లోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఇటీవల వరుసగా మూడురోజులు సెలవులు రావడంతో తల్లిదండ్రులతో గడపాలని ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం మళ్లీ కళాశాల మొదలు కావడంతో గద్వాలకు చెందిన స్నేహితులు మోయిజ్, ఎజాజ్‌తో కలిసి బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలోని అడ్డాకుల మండలం జానంపేట మలుపు వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ప్రవీణ్‌కుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మిగతా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి అటు నుంచి ఎస్వీఎస్కు తీసుకెళ్లారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ ముస్తాక్ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సంఘటనతో బాధిత తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
స్టాఫ్‌నర్సు ఆత్మహత్యాయత్నం
మహబూబ్‌నగర్ క్రైం/అడ్డకల్ న్యూస్‌లైన్: ఓ స్టాఫ్‌నర్సు తాను విధులు నిర్వహిస్తున్న పీహెచ్‌సీలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన శనివారం అడ్డాకుల మండలం జానంపేట పీహెచ్సీలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేర కు.. స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం(పీహెచ్సీ)లో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్న కృష్ణవేణికి శనివారం సాయంత్రం నుంచి విధులు నిర్వహించాల్సి ఉంది. తనకు సా యంత్రం వ్యక్తిగత పనిఉండటంతో ఉదయం విధులు నిర్వహిం చాల్సిన మరో స్టాఫ్‌నర్సుతో సర్దుబాటు చేసుకుని ఉదయం విధులకు వచ్చింది. దీంతో పీహెచ్సీ వైద్యాధికారిణి జరీనాభాను సదరు స్టాఫ్‌నర్సును పిలిచి డ్యూటీలు మార్చుకుంటే తన సమాచారం ఇవ్వాలని, మీ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే బాగుండదని తిరి గి వెళ్లాలని సూచించింది. రోస్టర్‌పద్ధతి ప్రకారం సాయంత్రం విధులకే రావాలని హుకుంజారీచేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో వైద్యాధికారిణి కృష్ణవేణికి మెమో జారీచేసింది. దీంతో మనస్తాపానికి గురైన స్టాఫ్‌నర్సు పీహెచ్‌సీలోనే ఓ గదిలోకి వెళ్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు సెల్ మెసేజ్ పంపించింది. ఇది గమనించిన తోటిసిబ్బంది ఆమెను వెంటనే చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడే కోలుకుంటుంది. వైద్యాధికారిణి కాంట్రాక్టు సిబ్బందిని ఓ విధంగా తనను మరోవిధంగా చూస్తోం దని బాధితురాలు వినిపిస్తోంది. వైద్యాధికారిణి ఏమన్నారంటే.. ‘రోస్టర్ ప్రకారం విధులు నిర్వహించాలని చెప్పడం తప్పైపోయింది. విధులకు సక్రమంగా హాజరుకాకుండా కుటుంబసమస్యలతో ఆమె ఎప్పుడు ఆందోళనగానే ఉండేది. శ నివారం కృష్ణవేణి సాయంత్రం డ్యూటీకి రావాలి. కానీ ఆమె ఉదయం డ్యూటీకి వచ్చింది. సాయంత్రం డ్యూటీకి రావాలని సూచించడంతో గొడవకు దిగింది. ఆస్పత్రిలోని ఓ గదిలోకి వెళ్లి నిద్రమాత్రలు మింగింది. వాస్తవంగా ఆమె నిద్రమాత్రలు మింగిందా? లేదా అనుమానంగా ఉంది..’అని వైద్యాధికారిణి జరీనాభాను పేర్కొంది. గతంలో కూడా ఆమె ఇక్కడపనిచేస్తున్న ఓ వైద్యుడిని బెదిరించేందుకు నిద్రమాత్రలు మింగినట్లు తెలిసింది.