తన వర్గం ఎమ్మెల్యేలు జారిపోకుండా అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ క్యాంపు రాజకీయాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, శశికళ క్యాంపులో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు ఎదురుతిరిగినట్టు సమాచారం. తాము పన్నీర్ సెల్వానికి మద్దతునిస్తామని, తమను విడిచిపెట్టాలని వారు కోరుతున్నట్టు చెప్తున్నారు. అయితే, ఇందుకు అనుమతించని శశి వర్గం బలవంతంగా వారిని బంధించి రిసార్ట్‌లో ఉంచినట్టు తెలుస్తోంది.