
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియాను ఈడి అరెస్టు చేసింది. మనీలాండరింగ్ ఆరోపలపై సౌమ్యను అరెస్టు చేసినట్లు పేర్కొంది. గతేడాది చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో దాడులు నిర్వహించి సుమారు రూ. 100 కోట్లకు పైగా హవాలా రాకెట్‌ను వెలికితీసినట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.
అంతేగాక హవాల లావదేవీల కింద అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించకుండా నగదు చేతులు మారుతోందని ఈడీ పేర్కొంది. ఫిబ్రవరి 2020లో చౌరాసియా ఇంటిపై కూడా దాడి చేసింది. ఐతే ముఖ్యమంత్రి భూపేష్ కేంద్ర ఏజెన్సీ చేసిన దాడిని రాజకీయ ప్రతీకార దాడి అభివర్ణించారు. పైగా తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నంలో భాగంగా ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
(చదవండి: కాంగ్రెస్‌ను వీడిన ముగ్గురు నాయకులకు...బీజేపీ కీలక భాద్యతలు)
Comments
Please login to add a commentAdd a comment