
అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆలయంలో భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన మౌలిక సదుపాయాల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 27 ఎకరాల్లో అభివృద్ధి చేసిన క్యాంప్‌ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సత్యపాల్ రావత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పలు విషయాలు తెలియజేశారు. రామ మందిర నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందని, అది ఇక్కడ పనిచేసే భద్రతా బలగాలకు సవాల్‌గా మారుతుందని సత్యపాల్ తెలిపారు.
అయోధ్యలో పలు భద్రతా సంస్థలు పనిచేస్తున్నాయని, వీటిలోని సిబ్బంది మధ్య ఎంతో సమన్వయం ఉందన్నారు. భద్రతా పరంగా ఇక్కడ నూతన ఏర్పాట్లు జరుగుతున్నాయని, దీనిలో భాగంగా భద్రతకు ఉపయుక్తమయ్యే ఆధునిక పరికరాలు కూడా తీసుకురానున్నామన్నారు. అయోధ్యలో భద్రత గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీఆర్‌పీఎఫ్ అన్నివేళలా, అన్ని పరిస్థితుల్లో సన్నద్ధంగా ఉంటుందన్నారు.
ఇది కూడా చదవండి: మణిపూర్‌లో మళ్లీ హింస: నలుగురి అపహరణ, కాల్పుల్లో ఏడుగురికి గాయాలు!
Comments
Please login to add a commentAdd a comment