
ఇంపాల్: మణిపూర్‌లో సాయుధ దుండగుల హింసాత్మక దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం మణిపూర్‌లోని జిరిబామ్‌లో సెంట్రల్ రిజర్వుడు పోలీసు ఫోర్స్, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈక్రమంలో సాయుధ తిరుగుబాటు దారులు కాలుపు జరిపారు. ఈ కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జనాన్‌తో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు.
ఉదయం 9. 40 గంటలకు గుర్తుతెలియని దుండగుడు 20వ సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌పై కాల్పులు జరిపినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. సీఆర్‌పీఎస్ బలగాలు, పోలీసులు మాన్‌బంగ్ గ్రామంలో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో జరిగినట్లు పేర్కొన్నారు.
ఈ కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్ అజయ్ కుమార్ (43), జిరిబామ్ ఎస్‌ఐతో సహా ముగ్గురి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. ఇక.. ఇటీవల కాలంలో జిరిబామ్ ప్రాంతంలో పలు హింసాత్మక ఘటనలు చేటుచేసుకుంటున్నాయి. జూన్‌లో కుకీ, మైతేయి వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో సుమారు 70 ఇళ్లు, పోలీసు పోస్టులకు తిరుగుబాటు దారులు నిప్పంటించారు.
Comments
Please login to add a commentAdd a comment