
సాక్షి, న్యూఢిల్లీ : సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) చీఫ్ ఏపీ మహేశ్వరి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయన ముఖ్య వైద్య అధికారికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో వైద్యుల సూచన మేరకు ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారు. సీఆర్‌పీఎఫ్ చీఫ్‌తో పాటు వైద్యుడికి దగ్గరగా మెలిగిన మరో 20 మందిని కూడా అధికారులు క్వారెంటైన్ కేంద్రానికి తరలించారు. ముందస్తు జాగ్రత్తగా వీరి నమూనాలను వైద్యులు సేకరించి.. పరీక్షా కేంద్రాలకు పంపారు. కాగా సీఆర్‌పీఎఫ్ చీఫ్‌కు వైద్య సేవలు అందించే డాక్టర్‌కు కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీనిలో భాగంగానే ఆయనతో మెలిగిన ప్రతి ఒక్కరినీ గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.