
శ్రీనగర్: కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ సీఆర్పీఎఫ్ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 33 ఏళ్ల అరవింద్ శనివారం ఉదయం ఎవరూ లేని సమయంలో తుపాకీతో కణతపై కాల్చుకుని అత్మహత్య చేసుకున్నాడు. అయితే దీనికి సంబందించి కారణం మాత్రం ఇంకా తెలిసిరాలేదు. ఈనెల 14న సెలవులను ముగించుకోని విధుల్లో చేరిన అరవింద్ పదిరోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటనకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది.
కుటుంబ, వ్యక్తిగత సమస్యల కారణంగానే జవాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అక్కడి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2014లో సీఆర్పీఎఫ్‌లో చేరిన అరవింద్ ప్రస్తుతం అనంతనాగ్‌లోని సర్ధార్ ఏరియాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మృతదేహాన్ని ఆయన స్వగృహానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.