
వీడియో నుంచి తీసిన చిత్రం
చండీఘడ్ : పుల్వామా ఉగ్రదాడికి కొద్ది క్షణాలు ముందు ఓ జవాన్ తన భార్యకు పంపించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉగ్రవాది, జైషే కమాండర్ ఆదిల్ అలియాస్ వకాస్ జరపిన ఈ ఆత్మహుతి దాడిలో 44 మంది జవాన్లు అసువులు బాసిన విషయం తెలిసిందే. అయితే సరిగ్గా ఈ ఘటనకు ముందు పంజాబ్‌కు చెందిన సుఖ్‌జిందర్ సింగ్ అనే జవాన్ తన మొబైల్లో చిత్రీకరించిన వీడియోను తన సతీమణికి పంపించారు. ఈ వీడియోలో సహచరులతో చర్చిస్తూ, కుటుంబ సభ్యులతో ఫోన్లలో మాట్లాడుతూ భారత సైనికుల ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. సుఖ్‌జిందర్‌సింగ్ ఈ వీడియో పంపిన మరికొద్దిసేపటికే కరుడు గట్టిన ఉగ్రవాది జవాన్ల కాన్వాయ్‌ని ఢీకొట్టి యావత్ భారతావనికి తీరని శోకం మిగిల్చాడు. తన భర్త మరణంతో శోకంలో మునిగిపోయిన అతని భార్య ఈ వీడియోను నిన్న (శుక్రవారం) చూసి ఇండియా టుడేతో పంచుకుంటూ కన్నీరుమున్నీరైంది. (చదవండి : భారత్-పాక్ మధ్య డేంజరస్ సిచ్యువేషన్: ట్రంప్)
19 ఏళ్ల వయసులోనే (2003లో) సీఆర్పీఎఫ్‌లో చేరిన సుఖ్‌జిందర్ సింగ్.. 76వ బెటాలియన్‌లో హెడ్‌కానిస్టెబుల్‌గా విధులు నిర్వహించేవారు. అతనికి ఏడు నెలల కుమారుడు ఉన్నాడు. తాజా ఉగ్రదాడిలో సుఖ్‌జిందర్ సింగ్ మరణంతో అతని భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇక సుఖ్‌జిందర్ సింగ్‌కు 8 నెలల క్రితమే హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించిందని అధికారులు తెలిపారు. ( చదవండి: మరిన్ని పుల్వామా ఉగ్రదాడి కథనాలు)
Comments
Please login to add a commentAdd a comment