పట్నా : బీహార్‌లోని గయా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు అక్కడ తనిఖీలు నిర్వహించగా.. మావోయిస్టులు కాల్పులు జరిపారని సీఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు. దీంతో తాము ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మృతదేహాలతో పాటు ఏడు తుపాకులు, ఒక ఏకే47, మూడు రైఫిళ్లు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment