
రాంచీ : జార్కండ్‌లోని గిరిధి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సీఆర్‌పీఎఫ్ జవాన్లు వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 154 బెటాలియన్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్లు మధుబన్ నుంచి నిమియాఘాట్‌కు వెళ్తుండగా మధుబన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
కాగా రోడ్డుపై ఒక్కసారిగా పశువులు అడ్డురావడంతో వాహనాన్ని డ్రైవర్ నియంత్రించే క్రమంలో అదుపుతప్పి బోల్తాపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన జవాన్లును చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో హెలికాప్టర్‌లో రాంచీకి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment