truck overturned
-
జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
రాంచీ : జార్కండ్లోని గిరిధి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 154 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు మధుబన్ నుంచి నిమియాఘాట్‌కు వెళ్తుండగా మధుబన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా రోడ్డుపై ఒక్కసారిగా పశువులు అడ్డురావడంతో వాహనాన్ని డ్రైవర్ నియంత్రించే క్రమంలో అదుపుతప్పి బోల్తాపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన జవాన్లును చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో హెలికాప్టర్లో రాంచీకి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురి మృతి
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లా పఠా రోడ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఆగ్రాకు మామిడిపళ్ల లోడుతో వెళుతున్న ట్రక్ పఠారోడ్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందగా, 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రక్కులో 16 మంది ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. -
మధ్యప్రదేశ్‌లో ట్రక్ బోల్తా: 14 మంది మృతి
మధ్యప్రదేశ్‌లోని ధాతియా జిల్లా రావల్ పూరా సమీపంలో బుధవారం ఉదయం ట్రక్ బోల్తా పడింది. ఆ ఘటనలో 14 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మంది కూలీలకు గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ధాతియా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ట్రక్‌లో ప్రయాణిస్తున్న వారంతా కూలీలే అని పోలీసులు చెప్పారు.