Giridih district
-
పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. అక్కడికక్కడే అయిదుగురు మృతి..
రాయ్పూర్: చత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును డీకొట్టింది. ఈఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో అయిదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గిరిదిహ్ జిల్లాలో శనివారం ఈ ప్రమాదం వెలుగుచూసింది. బాధితులంతా థోరియా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా శుక్రవారం తికోడిహ్ ప్రాంతంలో పెళ్లికి హాజరయ్యారు. అక్కడే భోజనం చేసి రాత్రి స్కార్పియో వాహనంలో ఇంటికి తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున బాగ్మారా గ్రామం సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదం దాటికి కారు పూర్తిగా ధ్వంసమైంది. గమనించిన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. కారులో మొత్తం పది మంది ప్రయాణిస్తుండగా.. ప్రమాద స్థలంలోనే అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన అయిదుగిరిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తొలిసారి.. ఇక్కడ పోలింగ్ భారమంతా మహిళలదే #WATCH | Jharkhand: 5 people died after their car collided with a tree in Baghmara, Giridih. The injured have been admitted to hospital. They were returning after attending a wedding function: Kamlesh Paswan, station in-charge, Mufassil police station, Giridih pic.twitter.com/pBLLnin0jR — ANI (@ANI) November 18, 2023 -
జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం
రాంచీ : జార్కండ్లోని గిరిధి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 154 బెటాలియన్కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు మధుబన్ నుంచి నిమియాఘాట్కు వెళ్తుండగా మధుబన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా రోడ్డుపై ఒక్కసారిగా పశువులు అడ్డురావడంతో వాహనాన్ని డ్రైవర్ నియంత్రించే క్రమంలో అదుపుతప్పి బోల్తాపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన జవాన్లును చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో హెలికాప్టర్లో రాంచీకి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
బ్యాంకు అధికారిపై దాడి.. లూటీ
రాంచీ: జార్ఖండ్లో దోపిడీదారులు మరోసారి రెచ్చిపోయారు. గిరిద్ జిల్లాలో.. ఓ బ్యాంకు అధికారిని టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ. 5 లక్షల విలువైన రెండువేల నోట్లను దుండగులు లూటీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఇటీవల బ్యాంకు నుంచి డబ్బు విత్ డ్రా చేసుకుని వెళ్తున్న వర్తకుడిపై ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు దాడి చేసి రూ. 5 లక్షలు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల దుండగుల ఆగడాలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.