భవనంపై నుంచి దూకిన కానిస్టేబుల్‌.. విషాదం | CRPF Constable Committed Suicide | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి దూకిన కానిస్టేబుల్‌.. విషాదం

Published Tue, Jul 30 2019 10:07 AM | Last Updated on Tue, Jul 30 2019 11:24 AM

CRPF Constable Committed Suicide - Sakshi

సాక్షి, విజయవాడ: ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఓ సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణాజిల్లా చిన్న ఆవుటపల్లి సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మరియా విన్నర్ అనే కానిస్టేబుల్‌ భవనంపై నుంచి దూకారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను సమీపంలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే చనిపోయారు. కానిస్టేబుల్ మరియా విన్నర్ తమిళనాడులోని నాగాపట్నంవాసి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని ఆత్కూరు పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. మరియా విన్నర్‌ ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement