సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1999 గ్రూప్–2, 2011 గ్రూప్–1 తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో ప్రకటించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయని కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ తెలిపారు. 1999 గ్రూప్–2 పోస్టుల మెరిట్ జాబితాను మళ్లీ రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
నెలాఖరులోగా గ్రూప్1 ఫలితాలు
ఇలా ఉండగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011 గ్రూప్–1 పోస్టులకు సంబంధించి మళ్లీ నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు ఈ నెలాఖరులోగా వెలువరించాలని కమిషన్ భావిస్తోంది. మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ 14 నుంచి 24వ తేదీవరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆరు పేపర్లకు గాను 5వ పేపర్లో కొన్ని తప్పులు దొర్లడంతో ఆ ప్రశ్నలను తొలగించి మూల్యాంకనాన్ని ప్రారంభించారు. ఇప్పటికి ఐదు పేపర్ల మూల్యాంకనం పూర్తయ్యింది. ఆరో పేపర్ మూల్యాంకనం జరుగుతోంది.
త్వరలో 1999 గ్రూప్–2, 2011 గ్రూప్–1 ఫలితాలు
Published Thu, Dec 15 2016 3:49 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement