సాక్షి, అమరావతి: గ్రూప్–1 సిలబస్‌ను మార్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తమ జీవితాలతో చెలగాటమాడుతోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఇచ్చినవీ సకాలంలో పూర్తి చేయకుండా ఇప్పటికే తమ తలరాతలు మార్చేస్తున్న ఏపీపీఎస్సీ ఇప్పుడు సిలబస్ మార్పుతో మరింత గందరగోళానికి గురి చేస్తోందని పేర్కొంటున్నారు. కొత్త సిలబస్ ప్రకటనతో రూ.లక్షలు ధారపోసి తాము పొందిన అంతా శిక్షణ అంతా వృథా కానుందని వాపోతున్నారు.
మెయిన్స్‌లో ఏడు పేపర్లు..
గ్రూప్–1 సిలబస్‌లో కమిషన్ ఇటీవల మార్పులు చేయడంతో నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్వల్ప మార్పులే ఉంటాయని చెప్పిన కమిషన్ పాత సిలబస్‌ను మార్చి రెట్టింపు చేయడం గగ్గోలు పుట్టిస్తోంది. గ్రూప్–1 సిలబస్, ఇతర అంశాల్లో మార్పులు చేస్తూ ఏపీపీఎస్సీ ఇటీవలే ముసాయిదా ప్రకటించిన సంగతి తెలిసిందే. మెయిన్స్‌లో గతంలో జనరల్ ఇంగ్లిష్‌తోపాటు 5 సబ్జెక్టులుండేవి. జనరల్ ఇంగ్లిష్‌లో అర్హత మార్కులు సాధిస్తే చాలు. ఇంటర్వ్యూల కోసం మిగతా ఐదు సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకునేవారు. ఈసారి మాత్రం మెయిన్స్‌లో పేపర్లను ఏడుకు పెంచారు. జనరల్ ఇంగ్లిష్‌తోపాటు తెలుగు పేపర్‌ను కూడా చేర్చారు. ఈ రెండింటిలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. వీటితోపాటు తక్కిన ఐదు పేపర్లలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలవనున్నారు.
ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు..
ఇక గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు పెట్టారు. ఒక పేపర్లో జనరల్ స్టడీస్, జనరల్ ఆప్టిట్యూడ్ ఉండగా పేపర్–2లో మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంశాలు పొందుపరిచారు.
మార్పులతో కొత్త చిక్కులు
ప్రిలిమ్స్ పేపర్–1లో పొలిటీలో సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంశాన్ని కొత్తగా చేర్చగా ఎకానమీలో ఏపీ ఎకానమీని చేర్చారు. పేపర్–2లో జనరల్ ఆప్టిట్యూడ్‌లో అడ్మినిస్ట్రేటివ్, సైకలాజికల్ ఎబిలిటీస్ టాపిక్‌ను కొత్తగా చేర్చారు. ఈ అంశాలకు సరైన పుస్తకాలు అందుబాటులో లేవని అభ్యర్ధులు పేర్కొంటున్నారు. ఈ సబ్జెక్టుల్లో ప్రశ్నలకు సరైన సమాధానాలు లేనందున న్యాయ వివాదాలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.
సిలబస్ రెట్టింపు..
–గతంలో మెయిన్స్‌లో ఇంగ్లీషుతో కలిపి ఆరు పేపర్లుండగా కొత్తగా తెలుగు చేర్చారు. ఇంగ్లిషు, తెలుగు రెండూ క్వాలిఫయింగ్ పేపర్లే. ఇంగ్లీషు సిలబస్‌ను కఠినం చేశారు. గతంలో మెయిన్స్‌లో ఒక్కో పేపర్‌కు 3 గంటల సమయం కేటాయించగా ఇప్పడు 2.30 గంటలకు తగ్గించారు.
–మెయిన్స్ పేపర్–2 లో కొత్తగా ఇండియన్, ఏపీ జాగ్రఫీని 50 మార్కులకు చేర్చారు. పేపర్–3లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ బేసిస్ నాలెడ్జి ఆఫ్ లా’ అంశాలను అదనంగా 120 మార్కులకు చేర్చారు. సివిల్స్‌లో ప్రధాన పేపర్‌గా ఉన్న ఎథిక్స్‌లోని అంశాలను ఇక్కడ కేవలం ఒక సెక్షన్లో పెట్టారు. హిస్టరీ, ఎకనామిక్స్‌లు పాత సబ్జెక్టులే అయినా వాటి అంశాలను మరింత ఎక్కువ చేశారు. దాదాపు రెట్టింపు అయిన సిలబస్‌కు సన్నద్ధం కావడానికి ఏడాది సమయం పడుతుందంటున్నారు. ఇప్పటికే పాత సిలబస్‌లో గ్రూప్–1 కోసం రూ.లక్షలు వెచ్చించి శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ నిర్ణయం పిడుగుపాటులా మారింది. ఏడాదిన్నరగా తీసుకున్న కోచింగ్ అంతా వృథా అని వాపోతున్నారు.
ఎన్టీఆర్ విద్యోన్నతి కింద చెల్లించిందంతా వృథా..
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద కోచింగ్ సెంటర్లకు కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. ఇదంతా పాత సిలబస్‌లోనే కొనసాగింది. ఇప్పుడు కొత్త సిలబస్ ప్రవేశపెట్టడంతో ఈ శిక్షణ అంతా వృథా కానుంది. సిలబస్ పెరగడంతో కోచింగ్ సెంటర్లు కూడా ఫీజు మూడు రెట్లు పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని కొత్త సిలబస్‌ను ప్రస్తుతం ఇవ్వనున్న నోటిఫికేషన్లకు కాకుండా తరువాత వెలువడే వాటికి వర్తింపచేయాలని కోరుతున్నారు. దీనివల్ల సివిల్స్ అభ్యర్ధులకూ ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు.
మెయిన్స్‌లో ఏడు పేపర్లు
గ్రూప్–1 సిలబస్‌లో కమిషన్ ఇటీవల మార్పులు చేయడంతో నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్వల్ప మార్పులే ఉంటాయని చెప్పిన కమిషన్ పాత సిలబస్‌ను మార్చి రెట్టింపు చేయడం గగ్గోలు పుట్టిస్తోంది. గ్రూప్–1 సిలబస్, ఇతర అంశాల్లో మార్పులు చేస్తూ ఏపీపీఎస్సీ ఇటీవలే ముసాయిదా ప్రకటించిన సంగతి తెలిసిందే. మెయిన్స్‌లో గతంలో జనరల్ ఇంగ్లిష్‌తోపాటు 5 సబ్జెక్టులుండేవి. జనరల్ ఇంగ్లిష్‌లో అర్హత మార్కులు సాధిస్తే చాలు. ఇంటర్వ్యూల కోసం మిగతా ఐదు సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకునేవారు. ఈసారి మాత్రం మెయిన్స్‌లో పేపర్లను ఏడుకు పెంచారు. జనరల్ ఇంగ్లిష్‌తోపాటు తెలుగు పేపర్‌ను కూడా చేర్చారు. ఈ రెండింటిలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. వీటితోపాటు తక్కిన ఐదు పేపర్లలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలవనున్నారు.
ప్రిలిమ్స్‌లో 2 పేపర్లు
ఇక గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు పెట్టారు. ఒక పేపర్లో జనరల్ స్టడీస్, జనరల్ ఆప్టిట్యూడ్ ఉండగా పేపర్–2లో మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంశాలు పొందుపరిచారు.
కొత్త చిక్కులు
ప్రిలిమ్స్ పేపర్–1లో పొలిటీలో సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంశాన్ని కొత్తగా చేర్చగా ఎకానమీలో ఏపీ ఎకానమీని చేర్చారు. పేపర్–2లో జనరల్ ఆప్టిట్యూడ్‌లో అడ్మినిస్ట్రేటివ్, సైకలాజికల్ ఎబిలిటీస్ టాపిక్‌ను కొత్తగా చేర్చారు. ఈ అంశాలకు సరైన పుస్తకాలు అందుబాటులో లేవని అభ్యర్ధులు పేర్కొంటున్నారు. ఈ సబ్జెక్టుల్లో ప్రశ్నలకు సరైన సమాధానాలు లేనందున న్యాయ వివాదాలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment