
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా గ్రూప్–1 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. జూన్ 2న నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది. ఇప్పటికే అన్ని రకాల క్లియరెన్స్‌లు ఉన్న 76 గ్రూప్–1 పోస్టులకు సంబంధించిన ఇండెంట్లు టీఎస్‌పీఎస్సీ వద్ద ఉన్నాయి. తాజాగా 42 డీఎస్పీ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
వాటితో పాటు 2011 గ్రూప్–1లో జాయిన్ కాని పోస్టులు మరో 7 వరకు ఉన్నాయి. అవి కాకుండా ఇతర శాఖల్లోనూ పదుల సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. వాటి భర్తీకి అనుమతులు రావాల్సి ఉంది. ఈలోగా వాటి అనుమతులు, ఇండెంట్లతో పాటు డీఎస్పీ పోస్టులకు ఇండెంట్లు ఇస్తే జూన్ 2న టీఎస్‌పీఎస్సీ ద్వారా 150కి పైగా పోస్టులతో గ్రూప్–1 నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment