సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు ఉచిత శిక్షణ కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు శాఖలో ఉద్యోగం కోసం తీవ్రమైన పోటీ ఉంటోందని, ప్రతిసారీ లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు. పోలీసు ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ, ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు.
సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అయిదు జోన్లలో కలిపి ఇప్పటికే భారీ ఎత్తున పోలీస్ ఉద్యోగాల ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్‌కు నిరుద్యోగ యువత సుమారు 21 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. దరఖాస్తులు ఎక్కువగా రావడంతో ఉచిత శిక్షణకు అర్హత సాధించే ప్రక్రియలో భాగంగా మంగళవారం అయిదు జోన్ల పరిధిలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 5న మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు 200 మార్కులకు సంబంధించిన అర్హత పరీక్షకు ధరఖాస్తు చేసుకున్న అభ్య ర్థులు విధిగా హాజరు కావాలన్నారు.
దరఖాస్తుదారులు హాల్ టికెట్ పొందేందుకు వారి ఫోన్లకు ఎస్సెమ్మెస్ ద్వారా లింక్ పంపించడంతో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్‌సైట్, సిటీ కమిషనర్ వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియా వేదికలైన నగర పోలీస్ ఫేస్‌బుక్ పే జీ, ట్విట్టర్ సహా స్థానిక పోలీసుస్టేషన్‌ను నేరు గా సంప్రదించాలని పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే సమయంలో తమ వెంట హాల్ టికెట్ పాటు వాటర్ బాటిల్, మాస్కు తప్పనిసరిగా తెచ్చుకోవాలని తెలిపారు.
- నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
Comments
Please login to add a commentAdd a comment