సాక్షి, అమరావతి: వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో సేవలు అందించడానికి 1,681 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి వైద్య శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైద్య శాఖలో విప్లవాత్మక మార్పులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లోనే ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడానికి 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో సేవలందించడానికి భారీగా ఎంఎల్‌హెచ్‌పీలను నియమిస్తున్నారు.
చదవండి: ఏపీఎస్ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు
ఇప్పటికే 8,351 పోస్టుల భర్తీ పూర్తయింది. మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. hmfw.ap.gov.in లేదా cfw.ap.nic.in ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు హాల్ టికెట్లు జారీ చేస్తారు. సెపె్టంబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీ హాల్‌టికెట్‌లలో తెలియజేస్తారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
అర్హతలు
అభ్యర్థులు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి.
సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) కోర్సుతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.
నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు 10 ఏళ్లు మినహాయింపు ఉంటుంది.
పరీక్ష ఇలా..
బీఎస్సీ నర్సింగ్ సిలబస్ నుంచి 200 ప్రశ్నలకు మల్టిపుల్ చాయిస్ విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు (మూడు గంటలు)లుగా నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment