30 జేసీజే పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌ | High Court Notification for filling 30 JCJ posts | Sakshi
Sakshi News home page

30 జేసీజే పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌

Published Wed, Mar 8 2023 3:18 AM | Last Updated on Wed, Mar 8 2023 3:18 AM

High Court Notification for filling 30 JCJ posts - Sakshi

సాక్షి, అమరావతి/గుంటూరు లీగల్‌: రాష్ట్ర జ్యుడీషియల్‌ సర్వీసెస్‌లో 30 జూనియర్‌ సివిల్‌ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో 24 పోస్టులను ప్రత్యక్ష భర్తీ ద్వారా, ఆరు పోస్టులను రిక్రూట్‌మెంట్‌ బై ట్రాన్స్‌ఫర్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఈ నెల 17 నుంచి ఏప్రిల్‌ ఆరో తేదీ వరకు హైకోర్టు వెబ్‌సైట్‌ (ఆన్‌లైన్‌)లో దరఖాస్తులు సమర్పించేందుకు గడువు ఇచ్చారు.

ఏప్రిల్‌ 24న కంప్యూటర్‌ ఆధారిత స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 40, అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించిన వా­­రిని 1:10 నిష్పత్తిలో రాతపరీక్షకు అనుమతిస్తారు. ఓసీ 15, ఈడ­బ్ల్యూ­ఎస్‌–3, బీసీ–ఏ 3, బీసీ–బీ 1, బీసీ–సీ 1, బీసీ–డీ 1, బీసీ–ఈ 1, ఎస్సీ–4, ఎస్టీ–1 చొప్పున పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు రిజిస్ట్రార్‌ (రిక్రూట్‌మెంట్‌) ఎస్‌.కమలాకర్‌రెడ్డి మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement