jcj
-
30 జేసీజే పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి/గుంటూరు లీగల్: రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్‌లో 30 జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 24 పోస్టులను ప్రత్యక్ష భర్తీ ద్వారా, ఆరు పోస్టులను రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ ఆరో తేదీ వరకు హైకోర్టు వెబ్సైట్ (ఆన్లైన్)లో దరఖాస్తులు సమర్పించేందుకు గడువు ఇచ్చారు. ఏప్రిల్ 24న కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 40, అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించిన వారిని 1:10 నిష్పత్తిలో రాతపరీక్షకు అనుమతిస్తారు. ఓసీ 15, ఈడబ్ల్యూఎస్–3, బీసీ–ఏ 3, బీసీ–బీ 1, బీసీ–సీ 1, బీసీ–డీ 1, బీసీ–ఈ 1, ఎస్సీ–4, ఎస్టీ–1 చొప్పున పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్) ఎస్.కమలాకర్‌రెడ్డి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. -
జేసీజేల నియామకానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జీ(జేసీజే)ల నియామకానికి ఎట్టకేలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూనియర్ సివిల్ జడ్జీ పోస్టుల భర్తీ కోసం త్వరలో జరగనున్న స్క్రీనింగ్ టెస్ట్‌లను షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకునేందుకు హైకోర్టు మంగళవారం అనుమతినిచ్చింది. 150 జడ్జీల పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రశాంతంగా ముగిసిన జేసీజే పరీక్షలు
హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) నియామక పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణకు సంబంధించిన ఒకేఒక్క సెంటర్ హైదరాబాద్ మీర్‌పేటలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్షలను నిర్వహించారు. 3,069 మంది న్యాయవాదులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 2,386 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ముగ్గురు డీసీపీల పర్యవేక్షణలో 200 మంది రిజర్వ్ పోలీసులతో గట్టి బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ న్యాయవాదుల నిరసన ఉమ్మడి హైకోర్టును విభజించి వెంటనే తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు కోర్టులకు సంబంధించిన ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆదివారం పరీక్షలను అడ్డుకోబోయారు. పరీక్ష కేంద్రమైన టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకొని కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై నిరసనకారులను విడిచి పెట్టారు. -
ప్రశాంతంగా ముగిసిన జేసీజే పరీక్షలు
హైదరాబాద్: మీర్‌పేటలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆదివారం నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జీల నియామక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. దరఖాస్తు చేస్తుకున్న 3069 మందిలో 2386 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ముగ్గురు డీసీపీలు, ముగ్గురు అడిషనల్ డీసీపీలు, 20 మంది ఏసీపీలు, 40 మంది సీఐలు, 90 మంది ఎస్ఐలు, 25 మంది ఏఎస్ఐలు, 600 మంది కానిస్టేబుళ్లు, 200 మంది రిజర్వ్ పోలీసులు విధులు నిర్వహించారు. కాగా,ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించి వెంటనే తెలంగాణ కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు కోర్టులకు సంబంధించిన ఎలాంటి పరీక్షలు నిర్వహించవద్దని డిమాండ్ చేస్తూ కొందరు న్యాయవాదులు పరీక్షలను అడ్డుకునేందుకు యత్నించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్ల కార్డులు ప్రదర్శించారు. వెంటనే పోలీసులు వారిని మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.