హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జీ(జేసీజే)ల నియామకానికి ఎట్టకేలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూనియర్ సివిల్ జడ్జీ పోస్టుల భర్తీ కోసం త్వరలో జరగనున్న స్క్రీనింగ్ టెస్ట్‌లను షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకునేందుకు హైకోర్టు మంగళవారం అనుమతినిచ్చింది. 150 జడ్జీల పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.