ECIL Hyderabad Recruitment 2021: Technical Officer Posts, Eligibility, Salary Details Here In Telugu - Sakshi
Sakshi News home page

ECIL Hyderabad: ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో 300 టెక్నికల్‌ ఆఫీసర్లు

Published Tue, Dec 14 2021 2:30 PM | Last Updated on Tue, Dec 14 2021 4:30 PM

ECIL Recruitment 2021: Technical Officer Posts, Eligibility, Salary Details Here - Sakshi

ECIL Hyderabad Recruitment 2021: భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఈఎంఎస్‌డీ, ఇతర విభాగాల్లో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► పోస్టులు: టెక్నికల్‌ ఆఫీసర్లు

► మొత్తం పోస్టుల సంఖ్య: 300

► అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ /ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్స్‌ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగాల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► వయసు: 30.11.2021 నాటికి 30ఏళ్లకు మించకుండా ఉండాలి. 

► వేతనం: నెలకు రూ.25వేలు చెల్లిస్తారు. 

► ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీనిలో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులను న్యూఢిల్లీలోని జోనల్‌ కార్యాలయంలో డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ కోసం పిలుస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 21.12.2021

► వెబ్‌సైట్‌: ecil.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement