కరోనా మహమ్మరి విజృంభిస్తున్న సమయంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీఓ శుభవార్త చెప్పింది. డీఆర్‌డీఓ ప్రయోగశాల డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్(డీఐపీఏఎస్) యాంటీబాడీ డిటెక్షన్-బేస్డ్ కిట్ 'డీప్ కోవాన్(DIPCOVAN)'ను అభివృద్ధి చేసింది. ఢిల్లీకి చెందిన వాన్‌గార్డ్ డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ కిట్, కరోనా వైరస్ తీవ్రత, దాని న్యూక్లియోక్యాప్‌సైడ్ ప్రొటీన్లను అది డిటెక్ట్ చేస్తుంది. వైరస్ తీవ్రత స్థాయిని 97 నుంచి 99 శాతం వరకు ఈ కిట్ పసిగట్టగలదని డీఆర్‌డీఓ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల కోసం మొన్నటికి మొన్న 2డీజీ మెడిసిన్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ అభివృద్ధి చేసింది.
డీఆర్డీఓ తెలిపిన వివరాల ప్రకారం.. డీప్ కోవాన్ ఇతర వ్యాధులతో ఎటువంటి క్రాస్ రియాక్టివిటీ లేకుండా శరీరంలో ప్రతిరోధకాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కేవలం 75 నిమిషాల కాలంలో పరీక్ష నిర్వహించవచ్చు. ఈ కిట్ జీవిత కాలం 18 నెలలు. ఈ కిట్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఏప్రిల్ 2021లో ఆమోదించింది. 2021 మేలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ), ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల నుంచి అమ్మకాలు & పంపిణీ కోసం ఆమోదం పొందింది. డీప్ కోవాన్ జూన్ మొదటి వారం నుంచి వాన్ గార్డ్ డయాగ్నోస్టిక్స్ ద్వారా వాణిజ్యపరంగా అందుబాటులో ఉంటుంది. కీలక సమయంలో దేశానికి అండగా నిలుస్తున్న డీఆర్‌డీఓని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు.
డిప్కోవన్ అంటే ఏమిటి?
డిప్కోవన్ కోవిడ్ -19 యాంటీబాడీ డిటెక్షన్ కిట్. ఒక వ్యక్తి గతంలో కోవిడ్ -19 వైరస్‌కు గురిఅయ్యడా?, అతని శరీరంలో ప్రతిరోధకాలు ఉన్నాయో లేదో గుర్తించడానికి ఇది సహాయపడుతుంది.
ఇది దేనికి ఉపయోగించబడుతుంది?
ప్రతిరోధకాలను గుర్తించడం దీని ప్రాథమిక ఉద్దేశ్యం. ఇది సెరో-సర్వేల వంటి కోవిడ్-19 ఎపిడెమియాలజీ అధ్యయనాలలో ఉపయోగించబడుతుంది. మీకు కోవిడ్ యాంటీబాడీస్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు.
ఎంత ఖర్చు అవుతుంది?
డీఆర్‌డీవో తెలిపిన వివరాల ప్రకారం.. దాని పరిశ్రమ భాగస్వామి వాన్ గార్డ్ డయాగ్నోస్టిక్స్ కిట్‌ను ఒక్కొక్కటి 75 రూపాయలకు విక్రయిస్తుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment