2DG Anti COVID Drug Released In Market: ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే "2–డీజీ "- Sakshi
Sakshi News home page

కరోనా: మార్కెట్‌లోకి 2-డీజీ డ్రగ్ విడుదల

Published Thu, May 27 2021 9:35 AM | Last Updated on Thu, May 27 2021 3:33 PM

DRDO And Doctor Reddys Releases 2DG Anti Covid Drug In Market - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: కరోనా బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే ‘2–డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్‌)’ ఔషధాన్నిడాక్టర్‌ రెడ్డీస్‌ గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ముందుగా 10వేల సాచెట్లను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు పేర్కొంది. 2-డీజీ ఔషధాన్ని డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా తయారు చేసిన విషయం తెలిసిందే.

2–డీజీ మందు.. పొడి రూపంలో లభిస్తుంది. దానిని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔషధం మన శరీరంలో వైరస్‌ సోకిన కణాల్లోకి చేరుకుని.. ఆ కణాల నుంచి వైరస్‌లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్‌ వృద్ధి తగ్గిపోతుంది. వైరస్‌తో కూడిన కణాల్లోకే చేరుకోవడం 2–డీజీ ప్రత్యేకత.
చదవండి:  డీఆర్‌డీవో గుడ్‌న్యూస్‌: కరోనా బాధితులకు కొత్త ఔషధం సిద్ధం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement